Kancheepuram Varadaraja Perumal temple beaten up by priests.. Video goes viral
Viral News: సుప్రసిద్ధ కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అర్చకులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. నడిరోడ్డుపై జగడానికి దిగారు. చుట్టూ ఉన్న జనం తమని గమనిస్తున్నారనే విషయం కూడా మరచిపోయారు. ఫైటింగ్ చేయడంలో పూర్తిగా లీనమయ్యారు. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయం వైష్ణవాలయంలో సుప్రసిద్ధమైంది. కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది. కాగా యాత్రలో మొదటి పాట పాడే విషయంలో వివాదం తలెత్తింది. పూజారులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. నడి రోడ్డులో అర్చకులు ఒకరిపై ఒకరు దాడి చేసిన సంఘటనను చూసిన ఆ ఫైటింగ్ దృశ్యాలను సెల్ఫోన్లో బంధించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతుంది.కాగా యాత్రలో మొదటి పాట పాడే విషయంలో వివాదం తలెత్తింది. పూజారులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. pic.twitter.com/iUXl1SNIvV