Sachin Defeak: సచిన్ డీఫ్‌ఫేక్ వీడియో.. గేమింగ్ కంపెనీపై కేసు
క్రికెట్ దిగ్గజం మాస్టర్ సచిన్ డీప్‌ఫేక్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ గేమింగ్ యాప్‌కు ఆయన అడ్వర్టైజ్ చేస్తున్నట్లు అందులో ఉంది. దీనిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.
Sachin Defeak: టెక్నాలజీ(AI) అభివృద్ధికి ఉపయోగపడాలే కానీ వినాశనానికి కాదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దాని ద్వారా పెద్ద కంపెనీలు తమ వర్క్ సులువు అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం దాన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. దాని ద్వారా సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న ప్రముఖులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితినే తాజాగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఎదుర్కొన్నారు. ఆయన డీప్‌ఫేక్ వీడియో నెట్టింట్లో హల్చల్ అవుతోంది. ఓ గేమింగ్ కంపెనీ తమ ప్రోడక్ట్ కోసం సచిన్ డీప్‌ఫేక్(Deep Fake) వీడియోను వాడుకున్నారు. ముంబయిలో ఆ కంపెనీని గుర్తించిన పోలీసులు యజమానిపై కేసు నమెదు చేశారు.
ఈ మధ్య సెలబ్రెటీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది డీప్‌ఫేక్ ఏఐ టెక్నాలజీ. రష్మిక మందన్న, అలియా భట్ తదితర నటీమనులు దీని బారిన పడ్డారు. ఇప్పుడు క్రికెట్ దిగ్గజం సచిన్ వంతు అయింది. స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ అనే గేమింగ్ యాప్‌కు సచిన్(Sachin Tendulkar) ప్రచారకర్తగా వ్యవహిరిస్తున్నట్లు ఆ ఫేక్ వీడియోలో ఉంది. దీనిపై సచిన్ తన ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని అన్నారు. టెక్నాలజీని ఇలా వాణిజ్య ప్రకటనలకు, ఇతర కార్యక్రమాలకు ప్రముఖుల అనుమతి లేకుండా బ్రాండింగ్ చేసుకోవడం సరైంది కాదని తెలిపారు. ఇలాంటి వీడియోలు ఎక్కడ కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని వెల్లడించారు. ఆ వీడియో ముంబయి క్రైమ్ పోలీసులకు సచిన్ ఫిర్యాదు చేశారు. సదరు గేమింగ్ యజమానిపై అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.