Kodali Nani: బాలకృష్ణ, చంద్రబాబు కలిసి జూ. ఎన్టీఆర్‌ను టచ్ కూడా చేయలేరు
ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా జూ. ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ ఆజ్ఙ మేరకు ఫ్లెక్సీలను తొలగించారని పలు మీడియా కథనాలు వచ్చిన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు.
Kodali Nani reacts to Jr. NTR's dismissal of Flexi
Kodali Nani: వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్‌ను ఏమి చేయలేరని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఆ సమయంలో అక్కడ జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని బాలకృష్ణ చెప్పడంతో, ఆయన అనుచరులు వాటిని తొలగించినట్లు పలు మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నారా లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను అనుచాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి అని అన్నారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినవారు ఆయన వర్ధంతిని చేయడం వింతగా ఉందన్నారు. ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతిని చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్‌ను గద్దె దింపిన బాలకృష్ణ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని పేర్కొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబును పిలుస్తోందని, తన కొడుకు లోకేష్‌ను సీఎం చేయాలనేదే చంద్రబాబు కోరిక అని చెప్పారు. గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన కొడాలి నాని అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఏ పార్టీ అయినా గట్టి పోటీ ఇస్తే మూడో ప్లేస్‌కి వెళ్లే ముష్టి గాడు చంద్రబాబు నాయుడు – కొడాలి నాని pic.twitter.com/8t4fe0lGBT