టాలీవుడ్ కింగ్ నాగార్జునకు సంక్రాంతి సీజన్ బాగా కలిసొస్తుంది. అందుకే.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను తన సినిమా సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యాడు. జెట్ స్పీడ్‌లో షూటింగ్ పూర్తి చేసి.. నా సామిరంగకు గుమ్మడికాయ కొట్టేశారు.
Naa Saami Ranga: ఏదేమైనా సరే, సంక్రాంతి బరిలో కింగ్ నాగార్జున ఉండాల్సిందే.. అంటూ నా సామిరంగ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. అనుకున్నట్టే.. రిలీజ్‌కు వారం రోజుల ముందు గుమ్మడికాయ కొట్టేశారు. నాగార్జున హీరోగా ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్న నాసామిరంగ సినిమాతో.. విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. అల్లరి నరేశ్ అంజిగాడు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు ప్లాన్ చేస్తునున్నారు.
Team #NaaSaamiRanga Wrapped up the entire shoot with great energy ❤️
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. సంక్రాంతి టార్గెట్‌గా స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్‌ను నాన్ స్టాప్‌గా కొట్టేశారు. కేవలం 70 వర్కింగ్ డేస్‌లో పాటలతో సహా మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టేశారు. సంక్రాంతిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదన్న పట్టుదలతో నాగార్జున ఈ సినిమాను కంప్లీట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇక షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేశారు కాబట్టి.. నెక్స్ట్ ప్రమోషన్స్ పై ఫుల్ ఫోకస్ చేయనున్నారు మేకర్స్.
ఇప్పటికే సంక్రాంతి రేసులో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా రెడీ అయిపోయాయి. దీంతో నాసామిరంగ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వేదిక చూస్తున్నారు. రేపో మాపో ఈవెంట్ పై క్లారిటీ రానుంది. మరి నా సామిరంగ ఎలా ఉంటుందో చూడాలి.