»Thandel Bharat Mataki Jai Naga Chaitanya Who Made A Sensation With Thandel
Thandel: భారత్ మాతాకీ జై.. ‘తండేల్’తో అదరగొట్టిన నాగ చైతన్య!
ఈసారి మాస్ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం చైతన్య లేటెస్ట్ ఫిల్మ్ తండేల్ జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. అదే స్పీడ్‌లో ఈ సినిమా నుంచి ఎసెన్స్ ఆఫ్ తండేల్ రిలీజ్ చేశారు.
Thandel: నాగచైతన్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో తండేల్ సినిమా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. గతంలో చందు మొండేటి, నాగ చైతన్య కలిసి చేసిన ప్రేమమ్, సవ్యసాచి అనుకున్నంత రేంజ్లో ఆకట్టుకోలేకపోయాయి. అందుకే ఈసారి శ్రీకాకుళం నేపథ్యంలో.. సముద్రం బ్యాక్ డ్రాప్లో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ‘తండేల్’ అంటూ.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా నుంచి.. ఎట్టకేలకు ఎసెన్స్ ఆఫ్ తండేల్ అంటు ఓ వీడియో రిలీజ్ చేశారు. ముందుగా అనుకున్నదాని ప్రకారం.. కాస్త లేట్‌గా రిలీజ్ చేసినప్పటికీ.. ఈ వీడియో మాత్రం అక్కినేని అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇచ్చేలా ఉంది. ‘ఈపాలి యేట.. గురి తప్పేదెలే.. ఇక రాజులమ్మ జాతరే.. అంటూ నాగచైతన్య ఎంట్రీ అదిరిపోయింది. రగ్గ్డ్ లుక్‌లో ఫిషర్ మేన్‌గా మస్త్ ఉన్నాడు నాగ చైతన్య. శ్రీకాకుళం నుంచి కట్ చేస్తే.. పాకిస్తాన్ జైలుకి కథ షిఫ్ట్ అయింది.
అక్కడ చైతన్య చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ‘మా నుంచి ఊడిపోయిన ఓ ముక్క.. మీకే అంతుంటే, ఆ ముక్కని ముష్టి వేసిన మాకెంత ఉండాలి.. నీ పాకిస్తాన్ అడ్డాలో కూర్చొని చెబుతున్నా.. భారత్ మాతాకీ జై..’ అంటూ దడదడలాడించాడు నాగ చైతన్య. ఇక వీడియో చివర్లో నాగచైతన్య కోసం ఎదురు చూస్తున్నట్టుగా.. బుజ్జితల్లి వచ్చేస్తున్నా.. అంటూ సాయి పల్లవి లుక్ రివీల్ చేశారు. మొత్తంగా ఎసెన్స్ ఆఫ్ తండేల్ సినిమా పై అంచనాలను పెంచేసింది. మొత్తంగా ఈ సినిమాతో చైతన్య మాస్ జాతర చేయడం పక్కాగా కనిపిస్తోంది.