2024 సంక్రాంతికి రిలీజ్ అయి.. టాలీవుడ్ ఆల్ టైం సంక్రాంతి హిట్‌గా నిలిచింది. అయితే.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా.. ఓటిటి డేట్ మాత్రం లాక్ అవడం లేదు. కానీ ప్రమోషన్స్ మాత్రం స్టార్ట్ అయ్యాయి.
Hanuman: హిట్ బొమ్మను థియేటర్లో ఎన్ని సార్లు చూసినా.. మనకు నచ్చిన సీన్‌ను, ఫైట్‌ను ఇష్టమొచ్చినట్టుగా రిపీట్ మోడ్‌లో చూడాలంటే ఆ సినిమా ఓటిటిలోకి రావాల్సిందే. అలాగే.. థియేటర్లో మిస్ అయిన వారు ఓటిటి డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ప్రస్తుతం ఓటిటి లవర్స్ అంతా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందా? అంటే, అది హనుమాన్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన హనుమాన్ ఓటిటి డేట్ విషయంలో అస్సలు క్లారిటీ రావడం లేదు. అదిగో, ఇదిగో అనడమే తప్ప డేట్ మాత్రం లాక్ చేయడం లేదు. సలార్, గుంటూరు కారం వంటి సినిమాలు నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. కానీ హనుమాన్ మాత్రం రావడం లేదు. అయితే.. ఓటిటిలోకి రాకముందే టీవిలోకి మాత్రం వచ్చేస్తోంది హనుమాన్.
మార్చి 16వ తేదీన రాత్రి 8 గంటలకు కలర్స్ సినీప్లెక్స్ టీవీ ఛానెల్లో హనుమాన్ టెలికాస్ట్ కానుంది. అదే రోజు.. జియోసినిమా ఓటిటి ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే.. హిందీ వెర్షన్ ఓటిటి ప్రమోషన్స్ కోసం హీరో తేజ సజ్జా ముంబై వెళ్లాడు. కానీ సౌత్ ఓటిటి అప్డేట్ మాత్రం బయటికి రావడం లేదు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జీ5 ఓటిటి ప్లాట్ఫామ్లోకి రావాల్సి ఉంది హనుమాన్. కానీ, ఇప్పటి వరకు స్ట్రీమింగ్ డేట్ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే, త్వరలో అనౌన్స్మెంట్ వస్తుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల ఓ అప్డేట్ ఇచ్చాడు. అయినా ఇప్పటికీ.. జీ5లో స్ట్రీమింగ్ డేట్ లాక్ చేయలేదు. ఉంటే.. మార్చి 15న లేదా 16న ఈ సినిమా జీ5 ఓటిటిలోకి వచ్చే ఛాన్స్ ఉంది.