»Game Changer Solid Update Game Changer First Single Is Coming
Game Changer: తమన్ సాలిడ్ అప్డేట్.. ‘గేమ్ చేంజర్’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది!
ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న తమన్ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. దీంతో చరణ్ ఫ్యాన్స్ డీజే మోతకు రెడీ అవుతున్నారు.
Game Changer: మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఎట్టకేలకు గేమ్ చేంజర్ అప్డేట్కు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే దిల్ రాజు, రామ్ చరణ్ బర్త్ డే నాడు సాలిడ్ అప్డేట్ ఉంటుందని చెప్పేశాడు. కానీ ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తారా? లేక సాంగ్ రిలీజ్ చేస్తారా? అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే.. ఇప్పుడు తమన్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. సూపర్ సింగర్ కార్యక్రమంలో గేమ్ చేంజర్ నుంచి సాంగ్ వస్తుందని చెప్పుకొచ్చాడు. మార్చి 27న చరణ్ బర్త్ డే నాడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని చెప్పుకొచ్చాడు. అయినా కూడా ఈ విషయాన్ని నమ్మలేమన్నట్టుగా.. అంటే, అన్నాడు గానీ ఆ ఊహా ఎంత బాగుందనే మాట వినిపిచండంతో.. తమన్ ఒక్కసారిగా నవ్వేశాడు.
కానీ ఈసారి మాత్రం గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ రావడం పక్కా అని ఫిక్స్ అయిపోయింది. అయితే.. గతంలో ఈ సినిమా నుంచి జరగండి జరగండి అనే సాంగ్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ ముందే లీక్ అయిన ఈ సాంగ్ పై ట్రోల్ జరగడంతో రిలీజ్ చేయలేదు. ఇప్పుడు చరణ్ బర్త్ డే ట్రీట్‌గా ఇదే సాంగ్‌ను రిలీజ్ చేస్తారా? లేదా మరో కొత్త సాంగ్ ఏదైనా రిలీజ్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. కేవలం పాటల కోసమే 90 కోట్ల వరకు ఖర్చు చేసినట్టుగా టాక్ ఉంది. తమన్ కూడా శంకర్ సార్ కోసం కొత్త బ్రెయిన్‌తో పని చేశానని చెబుతున్నాడు. దీంతో.. గేమ్ చేంజర్ ఆల్బమ్ పై భారీ అంచనాలున్నాయి. మరి తమన్ ఈసారి ఎలాంటి ట్యూన్స్ ఇచ్చాడో చూడాలి.