»The Lyrical Video Out Etthukelli Povaalanipisthunde From Na Sami Ranga Movie
Naa Saami Ranga: నుంచి ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది లిరికల్ వీడియో అవుట్
ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున యాక్ట్ చేస్తున్న తాజా చిత్రం నా సామి రంగ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అమిగోస్ ఫేమ్ ఆషిక రంగనాథ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది.
The lyrical video out Etthukelli Povaalanipisthunde from na Sami Ranga movie
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని(Nagarjuna Akkineni)సంక్రాంతికి రాబోతున్న చిత్రం నా సామి రంగ. ఇది ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ అప్డేట్ ప్రకటించారు. నటుడు విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్కు చెందిన నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఆస్కార్ అవార్డ్-విజేత స్వరకర్త MM కీరవాణి, ఆస్కార్-విజేత గీత రచయిత చంద్రబోస్ నాగార్జునకు మరో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించడానికి మరొకసారి సహకరించారు. ఈ నేపథ్యంలో మేకర్స్ మొదటి సింగిల్ ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. MM కీరవాణి అందించిన ఈ మెలోడీ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది.
రామ్ మిరియాల స్వరాలు కూడా చాలా బాగున్నాయి. చంద్ర బోస్ రాసిన సాహిత్యానికి నాగార్జున, ఆషికా రంగనాథ్‌ల కెమిస్ట్రీ కూడా అదిరిందని చెప్పవచ్చు. ఎప్పటిలాగే నాగార్జున స్టైలిష్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. పాటలో విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. ఈ సాంగ్ చూస్తుంటే కచ్చితంగా చార్ట్-టాపింగ్ హిట్ అవుతుందని అనిపిస్తుంది. 2024 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు.