Naa Saami Ranga: ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది..నాగ్ మాస్ లుక్ అదిరింది!
మరోసారి సంక్రాంతి బరిలో నిలిచి హిట్ అందుకోవడానికి వచ్చేస్తున్నాడు కింగ్ నాగార్జున. ప్రస్తుతం 'నా సామిరంగ' అనే సినిమా చేస్తున్నాడు నాగ్. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన నాగ్ లుక్ అదిరింది.
ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ‘నా సామిరంగ(Naa Saami Ranga)’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు నాగార్జున. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరింది. రీసెంట్గా ఈ మూవీలో హీరోయిన్ ఎవరో రివీల్ చేస్తూ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ గ్లింప్స్‌లో ‘మా వరలక్ష్మిని మీకు పరిచయం చేస్తున్నాం’ అని చెప్తూ అషికా రంగనాథ్‌ను చూపించారు. అచ్చమైన తెలుగమ్మాయిలాగా అదిరిపోయే లుక్‌లో కనిపించింది అషికా. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ క్యూట్ బ్యూటీ.. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘అమీగోస్’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది.
అయితే.. ఆ సినిమా అమ్మడిని నిరాశ పరిచింది. కానీ అషికా యాక్టింగ్, గ్లామర్‌కు తెలుగు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. అందుకే.. నెక్స్ట్ ఛాన్స్ నాగార్జునతో అందుకుంది. నా సామి రంగ గ్లింప్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది అషికా. ఇక ఈ గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ సింగిల్ అప్డేట్ కూడా ఇచ్చారు. ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే.. అనే పాటను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.
తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ ప్రోమో వస్తోంది అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్లో నాగార్జున ట్రాక్టర్ పైన కాలు పెట్టి ఊరమాస్ లుక్‌లో ఉన్నాడు. పంచె కట్టులో అదరగొట్టాడు నాగార్జున. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహిత కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ బిన్నీ డైరెక్ట్ చేస్తుండగా..శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, డైలాగులు అందించారు. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి.