Double ISmart: ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్?
డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయిందా? అంటే, ఔననే సమాధానం వినిపిస్తోంది. ఇక్కడి నుంచి డబుల్ ఇస్మార్ట్‌ను మరింగా పరుగులు పెట్టించేలా ప్లాన్ చేస్తున్నారట. ఇంతకీ ఫస్ట్ సాంగ్ ఎప్పుడు?
Double ISmart: ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు పూరి జగన్నాథ్, రామ్ పోతినేని. అయితే.. ఈ సినిమా తర్వాత ఇద్దరు కూడా మరో హిట్ కొట్టలేకపోయారు. అందుకే.. డబుల్ ఇస్మార్ట్‌తో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా అనౌన్స్ అయిన డబుల్ ఇస్మార్ట్.. ప్రస్తుతం షూటింగ్ స్టేజీలో ఉంది. ఈ మధ్య కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వచ్చినప్పటికీ.. ఇప్పుడు తిరిగి సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు.. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అవడమే కాదు.. మ్యూజికల్ హిట్‌గా కూడా నిలిచింది. మణిశర్మ ఇచ్చిన మాస్ బీట్స్‌కు గల్లి గల్లీలో డీజే మోత మోగించారు కుర్రాళ్లు. ఇస్మార్ట్ టైటిల్ సాంగ్, ధిమాక్ ఖరాబ్, బోనాలు లాంటి సాంగ్‌తో మాస్ డ్యాన్స్ చేయించాడు మణిశర్మ.
చదవండి:Keerthy Suresh: డిస్ట్రబ్ చేస్తున్న కీర్తి.. పూర్తిగా గ్లామర్ గేట్ల ఎత్తివేత?
ఇక ఇప్పుడు అంతకుమించి అనేలా డబుల్ మ్యూజికల్ జోష్‌తో రాబోతోంది డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాకు కూడా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ వేసిన పూరి.. ఈ మూవీ నుండి మే 15న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసేందుకు రెడీ అయినట్టుగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఇక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ డబుల్ ఇస్మార్ట్ అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. సమ్మర్ నుంచి పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాను.. జూన్‌లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో పూరి, రామ్ బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి.