»Disturbing Keerthy Suresh Completely Lifting The Glamor Gates
Keerthy Suresh: డిస్ట్రబ్ చేస్తున్న కీర్తి.. పూర్తిగా గ్లామర్ గేట్ల ఎత్తివేత?
క్యూట్ బ్యూటీ, హోమ్లీ బ్యూటీ అనే పదాలకు చెక్ పెడుతూ.. గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేస్తూ హాట్ బ్యూటీగా మారిపోయింది కీర్తి సురేష్. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కీర్తి.. హాట్ డోస్ గట్టిగానే పెంచేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Disturbing Keerthy Suresh.. Completely lifting the glamor gates?
Keerthy Suresh: హీరోయిన్లు అన్నాక.. సినిమాలో తమ పాత్రలను బట్టి గ్లామర్ షో చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు ముద్దుగుమ్మలు మాత్రం పూర్తిగా ఇందుకు విరుద్ధంగా ఉంటారు. గ్లామర్ షోకి ససెమీరా అంటూ ఉంటారు. వారిలో బొద్ముగుమ్మ కీర్తి సురేష్ ముందు వరుసలో ఉంటుంది. నిన్న మొన్నటి వరకు హోమ్లీ ఇమేజ్‌తో ఉన్న కీర్తి.. ఇప్పుడు హాట్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతోందనే చెప్పాలి. మిగతా వాళ్లకంటే నేనేం తక్కువ అనుకుందో ఏమో గానీ.. మెల్లి మెల్లిగా గ్లామర్ డోస్ పెంచడం స్టార్ట్ చేసింది కీర్తి. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతోనే యూటర్న్ తీసుకుంది కీర్తి. అక్కడి నుంచి సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తునే ఉంది.
అయితే.. కీర్తిలోని అసలైన గ్లామర్ ట్రీట్ చూసే సినిమా మాత్రం రాలేదు. ఇప్పుడా సమయం రానే వచ్చేసింది. ఇప్పటి వరకు పెద్దగా హద్దులు దాటని ఈ బ్యూటీ.. బాలీవుడ్ కోసం హోమ్లీ ఇమేజ్ను పూర్తిగా పక్కకు పెట్టేసినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో కలిసి బేబీ జాన్ అనే హిందీ సినిమాలో నటిస్తోంది కీర్తి సురేష్. కాలీస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళ్ ‘తేరీ’ రీమేక్‌గా తెరకెక్కుతోంది. మే 31న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ మూవీలో పార్టీ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటికొచ్చాయి. అందులో కీర్తి గ్లామర్ చూస్తే ఔరా అనాల్సిందే. ఇక్కడి నుంచి కీర్తి పూర్తిగా గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసిందనే చెప్పాలి. బేబీ జాన్ హిట్ అయితే.. కీర్తికి మరిన్ని బాలీవుడ్ ఆఫర్లు రావడం పక్కా. ఏదేమైనా.. కీర్తి మాత్రం ఇక నుంచి కుర్రాళ్లను తెగ డిస్ట్రబ్ చేసేలానే ఉంది.