»Is Babu A Good Businessman Ready For Pan India Entry
Mahesh Babu: బాబు పక్కా బిజినెస్‌మేన్? పాన్ ఇండియా ఎంట్రీకి రెడీ?
ఇప్పటి వరకు హీరోగా పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వలేదు సూపర్ స్టార్ మహేష్ బాబు. కానీ బిజినెస్ పరంగా పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే బిజినెస్‌తో దూసుకుపోతున్న మహేష్.. ఇప్పుడు బెంగుళూరుకు విస్తరించాడు.
Is Babu a good businessman? Ready for pan India entry?
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరో మాత్రమే కాదు.. పక్కా బిజినెస్‌మేన్ అనే చెప్పాలి. సినిమాలతో పాటు కమర్షియల్‌గా దూసుకుపోతున్న స్టార్ హీరోల్లో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. పలు బడా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ.. యాడ్స్ చేస్తూ.. కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు మహేష్. ఒక్క సినిమా, యాడ్స్ మాత్రమే కాదు.. బిజినెస్ పరంగా కూడా తగ్గేదేలే అంటున్నాడు మహేష్. ఇప్పటికే పలు రంగాల్లో మహేష్‌కు వ్వాపారాలున్నాయి. అందుకు సంబంధించి వ్యవహారలను మహేష్ సతీమణి నమ్రత చూసుకుంటోంది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఏఏంబీ సినిమాస్ హైదరాబాద్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఏషియన్ సునీల్ నారంగ్‌తో కలిసి ఈ మాల్ని నిర్మించాడు మహేష్. ప్రస్తుతం హైదరాబాద్‌లో మరో ఏఏంబీ నిర్మిస్తున్నారు.
ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏఎంబీ మాల్స్‌ను విస్తరించే పనిలో ఉన్నారు. తాజాగా బెంగుళూరులో ఏఏంబీ మాల్కి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. బెంగళూరు గాంధీనగర్‌లో ఉన్న కపాలి థియేటర్ కర్ణాటకలోనే అతిపెద్ద థియేటర్. ఇప్పుడు ఈ థియేటర్ ప్లేస్‌లో మహేష్ బాబు తన ఏఎంబీ సినిమాస్‌ని కడుతున్నారు. అంతేకాదు.. పాన్ ఇండియా లెవల్లో చెన్నై, ముంబై లాంటి పట్టణాల్లో కూడా ఏఎంబి విస్తరణకు ప్లాన్ చేస్తున్నారట. దీంతో.. సినిమాల పరంగా పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వకుండానే.. బిజినెస్ పరంగా దూసుకుపోతున్నాడు మహేష్. ఇక త్వరలోనే రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా కాదు.. ఏకంగా హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు మహేష్.