»Pushpa Actor Jagadeesh Arrested By Panjagutta Police
Pushpa: నటుడు అరెస్ట్..కారణమిదే
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పక్కన నటించిన నటుడు జగదీశ్(కేశవ)పై(jagadeesh) పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతను ఎందుకు ఈ కేసులో బుక్కయ్యాడు. ఆ కేసు వివరాలేెంటీ అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
pushpa actor jagadeesh arrested by panjagutta police
పుష్ప మూవీలో అల్లు అర్జున్ పక్కన సైడ్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన జగదీశ్(కేశవ)పై పంజాగుట్ట పోలీసులు(panjagutta police) కేసు నమోదు చేశారు. ఓ జూనియర్ అర్టిస్ట్ మరో వ్యక్తితో ఉన్నప్పటి పోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని జగదీశ్ బెదిరిస్తున్నారనే విషయంలో అతనిపై కేసు నమోదు చేశారు. జగదీశ్ వేధింపుల నేపథ్యంలో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ జూనియర్ అర్టిస్ట్ గత నెల 29న ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు.
ఆ మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న క్రమంలో ఆమెకు తెలియకుండా జగదీశ్ ఫొటోలు తీశాడు. ఆ తర్వాత వాటిని అడ్డుపెట్టుకుని ఆమెను బెదిరించాడు. ఆ విషయంలో మనస్తాపం చెందిన మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో కొన్ని రోజులకే కేసు నమోదు చేసిన పోలీసులు జగదీశ్ కోసం అప్పటి నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆ నేపథ్యంలో పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న జగదీశ్ ను పోలీసులు ఇవాళ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.