»Dhanush And Sekhar Kammula Movies At Pan India Level D51 Movie
Dhanush51: పాన్ ఇండియా లెవల్లో ధనుష్, శేఖర్ కమ్ముల మూవీ
ప్రముఖ హీరో ధనుష్, శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్న చిత్రం డీ51ను పాన్ ఇండియా లెవల్లో మూడు భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. పొలిటికల్ మాఫీయా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో మేకర్స్ ప్రకటించనున్నారు.
Dhanush and Sekhar Kammula movies at Pan India level d51 movie
తమిళ్ స్టార్ హీరో ధనుష్(dhanush), శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో వస్తున్న చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. తమిళం ధనుష్ మాతృభాష కాగా ఈ హీరో బాలీవుడ్లో కూడా రాంఝనా, షమితాబ్, అత్రంగి రే వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆనంద్ ఎల్ రాయ్‌తో హిందీలో తన తదుపరి చిత్రం ‘తేరే ఇష్క్ మే’ని కూడా ప్రకటించాడు.
అయితే ధనుష్ ఈ ఏడాది స్ట్రెయిట్ టాలీవుడ్ సినిమా ‘సార్(sir)’తో టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ధనుష్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా తమిళం, తెలుగు భాషలలో భారీ విడుదలకు సిద్ధంగా ఉన్న పీరియాడికల్ చిత్రం. అంతేకాదు ధనుష్ ప్రస్తుతం సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో తన రెండవ దర్శకత్వం వహిస్తున్న ‘డి 50’ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు.
మరోవైపు నాగార్జున కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న తదుపరి చిత్రం ‘D51’ ప్రకటించబడింది. ఈ సినిమాలో ధనుష్ సరసన తొలిసారిగా రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అతని హిందీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, నిర్మాతలు ఈ చిత్రాన్ని హిందీలో కూడా భారీ స్థాయిలో మౌంట్ చేయాలని డిసైడ్ అయ్యారు. పొలిటికల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో ‘డి51’ సినిమా రూపొందనుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరిలో ముంబై షెడ్యూల్‌తో షూటింగ్‌ను ప్రారంభించనుంది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్‌తో పాటు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.