దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చూసిన జనాలకు.. ఆ స్థాయిలో వస్తున్న గ్రాఫిక్స్ సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. గ్రాఫిక్స్ పరంగా రాజమౌళి సినిమాలనే పీక్స్‌లో చూస్తున్నారు. దాంతో ఆ అంచనాలను అదుకోవవడం మరో దర్శకుడి వల్ల కావడం లేదు. ఇటీవల వచ్చిన బ్రహ్మాస్త్ర, పొన్నియన్ సెల్వన్ సినిమాలే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక ఒకే ఒక్క టీజర్‌తో ఆదిపురుష్ గ్రాఫిక్స్‌ను కార్టూన్లా ఉందని తేల్చేశారు నెటిజన్స్. అయితే ఇప్పుడు ఆదిపురుష్ గ్రాఫిక్స్ కంటే దారుణమైన ట్రోల్స్ మరో సినిమా పై వస్తున్నాయి.
రీసెంట్గా షారుఖ్ ఖాన్(shahrukh khan) నటించిన ‘పఠాన్’ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.. కానీ ‘పఠాన్’ టీజర్‌లోని వీఎఫ్ఎక్స్ పై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతోంది. కొన్ని షాట్స్‌లో గ్రాఫికస్ మరీ దారుణంగా ఉన్నాయని.. స్క్రీన్ షాట్స్ తీసి మరీ ట్రోల్ చేస్తున్నారు. కొందరు బాలీవుడ్ పనైపోయిందని.. ‘పఠాన్’ కంటే సౌత్‌లో వస్తున్న ‘లో’ బడ్జెట్ సినిమాల గ్రాఫిక్స్ బెటర్ అంటున్నారు. అలాగే జెట్ ప్యాక్ విజువల్స్ ‘సాహో’ సినిమాకు కాపీలా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఇదే కాదు.. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన దీపికా పదుకొనే పై కూడా తెగ ట్రోలింగ్ జరుగుతోంది. దీపిక బికినీ యాక్షన్ సీన్స్ చూసి.. పాటలో అయితే ఓకే.. కానీ యాక్షన్‌లో బికినీ అవసరమా.. అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆదిపురుష్ ట్రోల్స్ నిలిచినంత హైలెట్‌గా.. పఠాన్ ట్రోలింగ్ ఫోకస్ అవడం లేదనే చెప్పాలి. బాలీవుడ్ వర్గాలు పెద్దగా దీన్ని హైలెట్ చేయడం లేదు.. కానీ ప్రభాస్ క్రేజ్ నెక్ట్స్ లెవల్ కాబట్టి.. డిసప్పాయింట్ చేశాడని ట్రోల్ చేశారు. ఈ లెక్కన ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.