»Tobacco Advertising Court Notices For Those Three Bollywood Star Heroes Because
Tobacco Advertising: ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోలకు కోర్టు నోటీసులు.. ఎందుకంటే?
బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లకు అలహాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎందుకు కోర్టు నోటీసులు జారీ చేసిందో వివరాల్లో తెలుసుకుందాం.
Tobacco Advertising: బాలీవుడ్లో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్న షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ క్రేజ్ గురించి తెలిసిందే. ఈ ముగ్గురు సీనియర్ సినీనటులకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గుట్కా కంపెనీల ప్రకటనల్లో నటించి పొగాకు ఉత్పత్తుల కంపెనీలకు మద్దతు ఇచ్చారని వీళ్లకు కోర్టు నోటీసులు ఇచ్చింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అక్టోబర్ 20న ఈ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌కు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే తెలియజేశారు. అయితే ఈ గుట్కా ప్రకటనలకు సంబంధించిన కేసును అటు అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టు కూడా విచారిస్తోంది.
గుట్కా కంపెనీలకు ప్రకటనలు ఇస్తున్న నటీనటులు, ప్రముఖులపై చర్యలు తీసుకోవాలని గతంలోనే కోర్టులో పిటీషన్లు దాఖలు అయ్యాయి. అయితే అందులో కొంతమంది నటులు వెనక్కి తగ్గారు. కాని మరికొంత మంది స్టార్స్ మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. అయితే వారిపై చర్యలు తీసుకోవాలని పిటీషనర్ కోర్టులో వాదించారు. అమితాబ్ బచ్చన్ కూడా ఈ ప్రకటనల్లో నటించారు. తర్వాత ఎగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నారు. అయినా అమితాబ్ ప్రకటనను ప్రదర్శిస్తున్నారని కోర్టుకు సమాచారం అందింది. ఈ కేసుపై తదుపరి విచారణ 2024 మే 9కి వాయిదా పడిందని వెల్లడించారు.