»Sekhar Kammula Said The Coming Of Age Telugu Film Happy Days Gets A Re Release
Sekhar Kammula : ‘హ్యాపీడేస్’ ఇప్పుడు చూసినా ఫ్రెష్‌గా అనిపించిందన్న శేఖర్ కమ్ముల
హ్యపీ డేస్ రీరిలీజ్ అయిన సందర్భంగా ఆ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమా గురించే కాకుండా మరెన్నో విషయాలను పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే...?
Sekhar Kammula : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’(Happy Days) సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2007లో విడుదలైన ఆ సినిమాని తాను ఇప్పుడు చూసినా ఫ్రెష్‌గానే అనిపిస్తుందని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు. అందుకనే ఆ సినిమా ఇప్పటి యూత్ ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతోనే రీ రిలీజ్(Re Release) చేసినట్లు తెలిపారు. అందులోని టైసన్ పాత్ర చాలా మేజికల్‌గా ఉంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
దర్శకుడిగా శేఖర్ కమ్ముల(sekhar kammula) ఇండస్ట్రీకి వచ్చి 24 ఏళ్లు పూర్తవుతోంది. అలాగే హ్యాపీ డేస్ రీరిలీజ్ కూడా అయ్యింది. ఈ సందర్భాలను పురస్కరించుకుని శేఖర్ ఎన్నో విషయాలను మీడియాతో ముచ్చటించారు. తాను ఎప్పుడూ విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి మాత్రమే సినిమాలు చేస్తానని అన్నారు. పేరు, డబ్బుల కోసంఈ రంగంలోకి రాలేదని అన్నారు. అందుకనే రెండు దశాబ్దాలకు పైగా ఉన్న తన సినీ ప్రస్తానాన్ని చూస్తే గర్వంగా ఉంటుందని తెలిపారు.
ఎక్కువ సినిమాలు తీయడం కంటే గుర్తుండి పోయే సినిమాలు తీయడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని శేఖర్ చెప్పుకొచ్చారు. అందుకనే తనకు కథ ఆలోచన రావడానికి, అది కార్య రూపం దాల్చడానికి ఎక్కువ సమయమే పడుతుందని అన్నారు. ఇక ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో రానున్న మల్టీ స్టారర్ సినిమా గురించి తాను ఎక్కువ చెప్పాలని అనుకోవడం లేదన్నారు. అయితే వారిద్దరూ ఆ కథకు చక్కగా సరిపోతారని మాత్రమే చెప్పగలనన్నారు. లీడర్ సినిమాకు సీక్వెల్ తీయాలని ఉందని, తీస్తే కచ్చితంగా మళ్లీ రాణాతోనే ఆ సినిమా చేస్తానని వెల్లడించారు.