ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2023 ఫలితాలను శుక్రవారం అధికారులు విడుదల చేశారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) మెయిన్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు ప్రధాన పరీక్ష నిర్వహించారు. అయితే తాజాగా ప్రకటించిన ఫలితాలలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లు కమిషన్ వెబ్సైట్ https://upsconline.nic.in/లో అప్లోడ్ చేయబడ్డాయి. ఇంటర్వ్యూ తేదీలను త్వరలో వెబ్సైట్ ద్వారా విడుదల చేస్తామని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రకటించిన ఫలితాల్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇతర సెంట్రల్ సర్వీసెస్ (గ్రూప్ A, B) ఎంపిక కోసం నిర్వహించే ఇంటర్వ్యూల అభ్యర్థులు ఉంటారు. అంతేకాదు కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున 28 మంది అభ్యర్థుల ఫలితాలు నిలిపివేయబడ్డాయని తెలిపారు. IAS మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు తప్పనిసరిగా DAF-2 ఫారమ్‌ను పూర్తి చేయాలి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పరీక్షలో 14,000 మంది విద్యార్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. ఇక UPSC మెయిన్ పరీక్షను సెప్టెంబర్ 15, 16, 17, 23, 24, 2023 తేదీల్లో రెండు సెషన్లలో నిర్వహించారు.