స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 8773 క్లర్క్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును అధికారులు పొడిగించారు. దీంతో మరో మూడు రోజుల్లో మరికొంత మంది ఉద్యోగార్థులు ఈ పోస్టుల కోసం అప్లై చేయనున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) క్లరికల్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ పోస్టులకు అప్లై చేయడానికి డిసెంబర్ 7 చివరి తేదీ ఉండగా..తాజాగా ఆ తేదీని డిసెంబర్ 10 వరకు పొడిగించారు. అయితే అనేక మంది అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. SBI క్లర్క్ 2023 నోటిఫికేషన్ జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) కోసం ఖాళీలను భర్తీ చేయడానికి నవంబర్ 16, 2023న విడుదల చేయబడింది. ఈ పరీక్ష కోసం మొత్తం 8,773 ఖాళీలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టుల కోసం అప్లై చేసుకునే ప్రక్రియ నవంబర్ 17, 2023 నుంచి మొదలైంది.
అంతేకాదు ప్రిలిమ్స్ పరీక్ష కూడా జనవరి 2024లో నిర్వహించబడుతుందని అధికారులు ప్రకటించారు. మెయిన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి 2024లో జరపనున్నారు. SBI క్లర్క్ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష స్థానిక భాషాల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థుల తుది ఎంపిక మెయిన్స్ పరీక్షలో వారి స్కోర్ ఆధారంగా అభ్యర్థులు అర్హత సాధిస్తారు. అభ్యర్థులు ఒక రాష్ట్రం/UTలో మాత్రమే ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దిష్ట రాష్ట్రం/యూటీలోని ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆ రాష్ట్రం/యూటీలో పేర్కొన్న స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. జూనియర్ అసోసియేట్లకు ఇంటర్ సర్కిల్ బదిలీ/ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ కోసం ఎలాంటి నిబంధన లేదు.
-SBI క్లర్క్ నోటిఫికేషన్ 2023 – నవంబర్ 16, 2023
-దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం – నవంబర్ 17, 2023
-దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ- డిసెంబర్ 10, 2023