»Massive Notification Released For Sbi Clerk 8283 Jobs
SBI Clerk Recruitment 2023: 8283 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ రిలీజ్
8,283 క్లరికల్ పోస్టుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు అర్హత కల్గిన ఉద్యోగార్థులు రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
Massive notification released for sbi clerk 8283 jobs
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నుంచి పెద్ద ఎత్తున 8283 క్లర్క్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో అర్హత గల ఉద్యోగార్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. SBI అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ క్లరికల్ కేడర్లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) 8283 ఖాళీలను భర్తీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 17న ప్రారంభమై డిసెంబర్ 7, 2023న ముగుస్తుంది.
ముఖ్యమైన తేదీలు
-దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 17, 2023
-దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 7, 2023
-ప్రిలిమినరీ పరీక్ష: జనవరి 2024
-మెయిన్స్ ఎగ్జామ్ : ఫిబ్రవరి 2024
ఈ పోస్టలకు అప్లై చేయాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత కల్గి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD) సర్టిఫికేట్ కలిగి ఉన్న అభ్యర్థులు ఉత్తీర్ణత తేదీ డిసెంబర్ 31, 2023న లేదా అంతకంటే ముందు ఉందని నిర్ధారించుకోవాలి. వయోపరిమితి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. దీంతోపాటు రిజర్వేషన్ల వారీగా వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ పరీక్ష (ప్రిలిమినరీ & మెయిన్ ఎగ్జామ్) పేర్కొన్న స్థానిక భాషలో పరీక్ష ఉంటుంది. 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష ఆన్లైన్లో నిర్వహించబడుతుంది. ఈ పోస్టులకు అప్లికేషన్ ఫీజు జనరల్/ OBC/ EWS కేటగిరీకి రూ.750 కాగా..SC/ ST/ PwBD/ ESM/DESM దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.