»Rbi Risk Weight Increase Decision Regarding Personal Loans
Personal loans: విషయంలో ఆర్బీఐ సంచలన నిర్ణయం
ఇటివల కాలంలో పర్సనల్ లోన్స్ ఎక్కువయ్యాయి. అనేక ఫీన్ టెక్ సంస్థలు నిమిషాల్లోనే సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు ఇచ్చే వ్యక్తి గత రుణాలను కట్టడి చేయడానికి కీలక నిబంధనలను జారీ చేసింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
RBI risk weight increase decision regarding personal loans
బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు భద్రత లేని వ్యక్తిగత రుణాలు(personal loans) ఇచ్చే విషయంలో రిజర్వ్ బ్యాంక్(RBI) గురువారం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న రిస్క్ వెయిట్లను 25 శాతం పాయింట్లు(25 percentage points) పెంచి సవరించింది. అయితే ఈ నిబంధనలు హౌసింగ్, విద్య, వాహన రుణాలతో సహా నిర్దిష్ట వినియోగదారు రుణాలపై వర్తించవని తెలిపింది. అంటే ఇప్పుడు వినియోగదారులకు రుణాలు ఇవ్వడానికి రిస్క్ వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. కొత్త, పాత రుణాలకు ఇది వర్తిస్తుంది. రిస్క్ వెయిట్ 25% పెరిగింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. మారిన నిబంధనల వల్ల పర్సనల్ లోన్ మరింత ఖరీదైనది అవుతుంది.
ఆర్బిఐ(RBI) వెబ్సైట్లో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్లో వాణిజ్య బ్యాంకులకు సంబంధించి జారీ చేసిన నిబంధనల ప్రకారం, వినియోగదారు రుణానికి రిస్క్ వెయిటేజీని 100% నుంచి 125%కి పెంచారు. ఇందులో అన్ని రకాల రిటైల్ రుణాలు ఉంటాయి. అయితే హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, వెహికల్ లోన్, గోల్డ్ లోన్ లను మినహాయించారు. ఇందులో మైక్రో ఫైనాన్స్ రుణాలు, స్వయం సహాయక సంఘాలకు పంపిణీ చేసే రుణాలను కూడా తప్పించారు.
అయితే రిస్క్ వెయిట్ పెరిగితే నష్ట భయం కూడా పెరుగుతుంది. ఆ వెయిట్ పెంచడం వల్ల ఆ కేటగిరీలో బ్యాంకులు(banks) కూడా రుణాలు ఇచ్చే సౌలభ్యం గతంలో కంటే తగ్గుతుంది. కరోనా తర్వాత ఇటివల కాలంలో ఫిన్ టెక్ సంస్థలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి. అంతేకాదు నిమిషాల్లోనే హామీలేని వ్యక్తి గత రుణాలు ఇచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెక్యురిటీ లేని రుణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇప్పటికే సూచించారు. హామీ లేని రుణాలు ఎక్కువగా పెరుగుతున్నాయని వీటిని కట్టడి చేయాలని వెల్లడించారు.