Kavita judicial custody extended for 14 days in Delhi liquor case
Kavita: ఢిల్లీ మద్యం పాలసీ తయారు కేసులో ప్రధాన ఆరోపనలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితా అరెస్టై 40 రోజులు దగ్గర పడతుంది. తీహార్ జైల్లో ఉన్న కవిత ఈ రోజు రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టులో హాజరయ్యారు. కవిత తరఫు న్యాయవాది, ఈడీ వాదనలు విన్న కోర్టు కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించి తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో కవిత మే 7 వ తేదీ వరకు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. జ్యుడీషియల్ కస్టడీ అవసరం లేదని కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అందుకు ఈడీ వాదనలు వినిపిస్తూ.. సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని, కేసుపై ప్రభావ చూసే అవకాశం ఉందని వాదించారు.
ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కవిత కస్టడీని పొడగిస్తూ తీర్పు చెప్పింది. కేసు పురోగతి వివరాలను కోర్టు పరీశిలించింది. కవిత అరెస్ట్‌పై త్వరలో ఛార్జీషీట్ దాఖలు చేస్తామని ఈడీ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రధాన ఆరోపనలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా కస్టడీ పోడిగించింది. ఆయన ఆరోగ్యం, తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చినా కేసు పురోగతిపై ప్రభావం పడుతుందని కేజ్రీవాల్ కస్టడీని కూడా కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది.