ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ హీరోలు ఓటిటి బాట పట్టారు. ఆ మధ్య బాబాయి అబ్బాయి వెంకటేష్, రానా కలిసి చేసిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు' సంచలనంగా నిలిచింది. ఇక ఇప్పుడు నాగ చైతన్య ఓటిటి ఎంట్రీకి రంగం సిద్ధమైంది.
Naga Chaitanya: ఎందుకో, ఏమో తెలియదు గానీ.. ప్రస్తుతం అక్కినేని మూడో తరం హీరోలు బ్యాడ్ టైం ఫేజ్ చేస్తున్నారు. కొడుకులే కాదు తండ్రి కూడా ఫ్లాపుల్లోనే ఉన్నాడు. నాగార్జునతో పాటు నాగ చైతన్య, అఖిల్ బాక్సాఫీస్ రేసులో వెనకబడిపోయారు. అందుకే అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌తో సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. చివరగా థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా, కస్టడీ సినిమాలతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన అక్కినేని నాగ చైతన్య.. ప్రస్తుతం కార్తికేయ2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్లో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
చైతన్య ఓటిటిలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. గతంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ధూత అనే వెబ్ సిరీస్‌ను అనౌన్స్ చేశాడు. మనం లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. మధ్యలో అసలు ధూత ఏమైందనే విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటికే వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలం అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సిరీస్ రిలీజ్ డేట్ లాక్ అయినట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 1 నుండి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ధూత’ డిజటల్ స్ట్రీమింగ్కు రానున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరి ధూతగా నాగ చైతన్య ఓటిటిలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.