దీపావళికి వచ్చిన సినిమాల్లో టైగర్ 3 పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ సినిమా.. నవంబర్ 12న ఆడియెన్స్ ముందుకొచ్చింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకుంది.
Tiger 3: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3. దీపావళి కానుకగా నవంబర్ 12 గ్రాండ్‌గా విడుదల అయిన ఈ మూవీ ఊహించినట్లే ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి. ఫస్ట్ డే ఇండియాలో 44 కోట్ల నెట్.. 65 కోట్ల వరకూ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ కలుపుకొని మొత్తంగా వరల్డ్ వైడ్‌గా 53 కోట్లకు పైగా నెట్.. 80 కోట్ల వరకూ గ్రాస్‌ను వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.
‘టైగర్ 3’ మూవీకి దాదాపు 300 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్టే దాదాపు 9000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. దీపావళి రేసులో పెద్ద సినిమాలు లేకపోవడంతో టైగర్3 భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం అంటున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటించాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ సినిమాను.. మనీష్ శర్మ డైరెక్ట్ చేశాడు.
ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ క్యామియో ఇచ్చారు. అయితే.. వార్2లో ఎన్టీఆర్ కూడా నటిస్తుండడంతో.. టైగర్ 3లో యంగ్ టైగర్ క్యామియో ఉంటుందని వార్తలొచ్చాయి. కానీ.. సినిమా రిలీజ్ అయ్యాక ఇందులో నిజం లేదని తేలిపోయింది. లేదంటే.. ఈపాటికే సోషల్ మీడియా తగలబడిపోయి ఉండేది. కానీ టైగర్ 3 చూసిన వారంతా వార్2 మామూలుగా ఉండదని అంటున్నారు. నెక్స్ట్ యష్ రాజ్ ఫిలింస్ నుంచి వస్తున్న స్పై యూనివర్స్ కావడంతో.. వార్2 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.