»Rashmika Celebrates Diwali With Vijay Deverakonda Family
Vijay ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు..!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి దీపావళి పండగ సెలబ్రేట్ చేసుకున్నారని తెలిసింది. వారిద్దరూ షేర్ చేసిన ఫోటోల్లో కామన్‌గా గోడను బట్టి నెటిజన్లు కనిపెట్టేశారు.
Vijay: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య లవ్ ఎఫైర్ ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ లివిన్ రిలేషన్లో ఉంటున్నారనే ప్రచారం తెగ జరుగుతోంది. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు కలిసి దీపావళి పండగ చేసుకున్నారనే విషయం తెలిసింది.
నెటిజన్లకు దొరకకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ ఫోటోలను వ్యక్తిగతంగా షేర్ చేసుకుంటున్నారు. కానీ రష్మిక దీపావళి ఫోటోలను బట్టి తెలిసింది. ఆ ఫోటోలు విజయ్ దేవరకొండ ఇంట్లో తీసినట్టు అర్థం అవుతోంది. విజయ్, రష్మిక ఇద్దరూ షేర్ చేసిన ఫోటోల్లో కామన్‌గా కనిపించిన గోడ సహాయంతో ఇద్దరూ ఒకేచోట దీపావళి జరుపుకున్నారనే విషయం తెలిసింది.
గత ఏడాది ప్రారంభంలో విజయ్, రష్మిక మాల్దీవులకు సెలవు కోసం వెళుతున్న సమయంలో ఎయిర్ పోర్టులో కనిపించారు. దీంతో వారి రిలేషన్ షిప్ గురించి తెలిసింది. విజయ్, రష్మిక మందన్న తాము డేటింగ్ చేస్తున్నామని ఎప్పుడూ చెప్పలేదు. మంచి స్నేహితులం అని మాత్రమే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్మిక ప్రస్తుతం పుష్ప2, యానిమల్ మూవీల్లో నటిస్తుండగా, విజయ్ దేవర కొండ ఫ్యామిలీ మాన్ లో నటిస్తున్నాడు.