»Why That 4 Contests Are Not Eliminated In The Bigg Boss 7
Bigg Boss 7 Telugu: ఆ నలుగురు ఎందుకు ఎలిమినేట్ కావడం లేదంటే..?
బిగ్ బాస్ 7 తెలుగు నుంచి ఆ నలుగురు మాత్రం ఎలిమినేట్ కావడం లేదు. సరిగ్గా ఆడకున్నా సరే వారిని హౌస్‌లో కంటిన్యూ చేస్తున్నారు. దీనికి గల కారణం మాత్రం మరొకటి ఉందని నెటిజన్లు అంటున్నారు.
Why That 4 Contests Are Not Eliminated In The Bigg Boss 7
Bigg Boss 7: బిగ్ బాస్ 7 తెలుగు ఉల్టా పుల్టా రంజుగా సాగుతోంది. మంచిగా ఆడేవారే ఎలిమినేట్ అవుతూ వస్తోన్నారు. 10వ ఎపిసోడ్లో భోలే షావలి ఇంటి నుంచి బయటకు వచ్చారు. అంతకుముందు టేస్టీ తేజ కూడా ఎలిమినేట్ అయ్యారు. హౌస్‌లో సరిగా ఆడకున్నా రతిక ఇప్పటికీ హౌస్‌లో కొనసాగుతున్నారు. ఓ నలుగురు మాత్రం హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం లేదు. వారంతా బిగ్ బాస్ షో నిర్వహిస్తోన్న చానెల్లో సీరియల్స్ చేస్తున్నవారే.. కావాలని ఎలిమినేట్ చేయడం లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి.
అర్థం కానీ ఎలిమినేషన్
ఉల్టా పుల్టా సీజన్ చక్కగా సాగుతోంది. జనాలు కూడా కనెక్ట్ అయ్యారు. ఎలిమినేషన్ మాత్రం అర్థం కావడం లేదు. ఊహించిన వారు మాత్రం కావడం లేదు. టైటిల్ విన్నర్ రేసు గురించి ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారు. టాప్-5 కంటెస్టెంట్ ఎవరనే అంశంపై అంతా ఓ లెక్క కట్టారు. హౌస్ నుంచి నలుగురు అమర్దీప్, శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్ ఎలిమినేట్ కావడం లేదు. వీరు చక్కగానే ఆడుతున్నారు.. అయినప్పటికీ, స్టార్ మాలో వచ్చే సీరియల్స్‌లో నటించి హౌస్‌కు వచ్చారు. మిగతా వారిలానే ఆడుతున్నారు. భోలే షావలీ, టేస్టీ తేజ వీరి కన్నా తక్కువ ఏం ఆడలేదు. కానీ హౌస్‌లో అలానే కొనసాగుతున్నారు.
ఓట్లు వచ్చాయా..? లేదంటే
వీరికి నిజంగానే ఓట్లు వచ్చాయా..? లేదంటే ఆ చానెల్ ఏమైనా కావాలనే అలా చేస్తోందా అనే సందేహాం సగటు ప్రేక్షకుడికి వచ్చింది. లేదంటే మిగతా వారు హౌస్ నుంచి ఎలా బయటకు వస్తారనే చర్చ వచ్చింది. అమర్ దీప్ అయితే హౌస్‌లో ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అంతా అనుకున్నారు. అతనికి ఏ విషయం సరిగా అర్థం కాదు.. ప్రతీ వారం హోస్ట్ నాగార్జున చేత తెగ తిట్లు పడతాడు. అలాగే ప్రతీ వారం నామినేషన్లో ఉంటాడు.. కానీ సేఫ్ అవుతాడు. శోభా శెట్టి అలియాస్ మోనిత కూడా అంతే.. హౌస్‌లో రచ్చ రచ్చ చేస్తోంది. ఆడటం ఓకే.. గొడవే ఎక్కువ.. అయినప్పటికీ ఆమె కూడా ఇప్పటికీ హౌస్‌లో కంటిన్యూ అవుతున్నారు. మేకప్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటారని నాగార్జున కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
వంట చేస్తే సరిపోతుందా..?
ప్రియాంక.. అందంగా ఉన్న అమ్మడు.. చక్కగా నవ్వుతూ.. గేమ్ వచ్చిన సమయంలో అంతే ఆడుతుంది. టేస్టీ తేజ కోసం కెప్టెన్సీ టాస్క్‌లో కూడా బాగా ఆడింది. అమర్ దీప్ విశ్వరూపం ప్రదర్శించడంతో ఓడిపోక తప్పలేదు. ప్రియాంక, అమర్‌తో కలిసి టీమ్‌గా ఉంటోంది. సీజన్ స్టార్ట్ అయిన ఫస్ట్‌లో ఆడకున్నా.. తర్వాత పుంజుకుంది. ప్రియాంక కన్నా చక్కాగా ఆడేవారు హౌస్ నుంచి బయటకు రావడంతో.. ఆమె ఎందుకు రావడం లేదబ్బా అనే డౌట్ ప్రతీ ఒక్కరికీ కలుగక మానడం లేదు. హౌస్‌లో ప్రియాంక వంట చేసి పెడుతుంది. ఆట మాత్రం ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. దీంతో ఆమెను ఎందుకు కొనసాగిస్తున్నారనే సందేహాం వస్తోంది.
నాగార్జున కూడా ఏమీ అనడం లేదు
చివరగా.. అర్జున్.. ఇతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారు. ఆట ఆడుతున్న అందరితో కలిసి పోవడం లేదు. ఆ తర్వాత కలుపు గొలుపుగా ఉన్నాడు. హోస్ట్ నాగార్జున కూడా.. అర్జున్‌కు పెద్దగా క్లాస్ ఇచ్చింది లేదు. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్లలో అర్జున్‌కు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. రోజుకు రూ.35 వేల చొప్పున చెల్లిస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. అతని క్రేజ్ షోకు పనికి వస్తోందనే ఉద్దేశంతో హౌస్‌లో ఉంచి ఉంటారు. అతను కూడా స్టార్ మా సీరియల్స్‌లో నటించి ఉండటంతో డౌటానుమానం రాక మానడం లేదు.
ఎందుకు రావడం లేదబ్బా..?
సో.. ఇలా ఆ నలుగురు మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం లేదు. సరిగ్గా ఆడకున్నా సరే.. అలానే ఉంచుతున్నారు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం టైటిల్ విన్నర్ ప్రశాంత్, గౌతమ్, అర్జున్ అనే టాక్ వస్తోంది. సో వీరిలో ఇద్దరు బయట నుంచి వచ్చివారు కాగా.. మిగిలిన ఒక్కరికీ స్టార్ మాతో అనుబంధం ఉంది. తమ గ్రూపు నుంచి వచ్చిన వారిని టైటిల్ విన్నర్ చేయాలనే ఇలా చేస్తున్నారా అనే అనుమానం వస్తోంది. సీజన్ గడిచేకొద్దీ ఆ సందేహాం బలపడుతోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.