మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ 16వ మూవీ సంగీత దర్శకుడు కన్ఫామ్ అయ్యాడు. మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రహమాన్ స్వరాలు సమకూరుస్తారు. ఈ మేరకు దర్శకుడు బుచ్చిబాబు ధృవీకరించారు.
Official: AR Rahman to compose music for Ram Charan’s film
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ , ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. సంగీతం రెహమాన్ అందిస్తాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా క్లారిటీ వచ్చింది. నిన్న జరిగిన బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్లో దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా ధృవీకరించారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలకు పనిచేస్తున్నాడనే వార్తలు చాలా రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
బిగ్ బాస్ తెలుగు 7 తాజా దీపావళి ఎపిసోడ్లో బుచ్చి బాబు దానిని ధృవీకరించారు. AR రెహమాన్ రామ్ చరణ్‌తో తన చిత్రంలో పనిచేస్తున్నట్లు ప్రకటించారు. అతను కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కనిపించిన ప్రముఖ టీవీ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ అంబటికి మంచి పాత్రను ఇస్తున్నట్లు ఇదే స్టేజ్ పై ప్రకటించడం విశేషం.
ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం చరణ్ 16వ మూవీ. అందుకే దీనికి తాత్కాలికంగా RC16 అని పేరు పెట్టారు. ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీని సెలక్ట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, బుచ్చి స్క్రిప్ట్ కోసం చాలా సమయం వెచ్చించాడని సమాచారం. ఇది 1980ల కాలం నాటి నేపథ్యంలో గ్రామీణ క్రీడా నాటకం (కబడ్డీ)గా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం.
షూటింగ్ ఏడాది చివరలో ప్రారంభం కావడానికి ప్లాన్ చేస్తున్నారు. లేదంటే వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ విడుదలైన వెంటనే చిన్న గ్యాప్‌లో సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది.