పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ప్రశాంత్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అతనితో పాటు అతని సోదరుడికి కూడా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Bigg Boss: రైతుబిడ్డగా బిగ్‌బాస్ సీజన్-7లోకి అడుగుపెట్టి టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్‌ను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు రాజును సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి ఇద్దరిని జడ్జి ఇంట్లోకి ప్రవేశపెట్టారు. తర్వాత ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయవాది పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇద్దరిని అర్థరాత్రి పూట చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడు వినోద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న మరో 14 మంది యువకులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
#Hyderabad: Winner of Bigg Boss Telugu Season 7, Pallavi Prashanth, has found himself on the wrong side of the law. The arrest took place at his residence in Gajwel, unfolding a dramatic chapter in the aftermath of the show's grand finale. He was sent on judicial remand. pic.twitter.com/XP0DG8Stgr
బిగ్‌బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17న జరిగింది. ఫినాలో జరిగిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు ఫినాలే కంటెస్టెంట్స్ అభిమానులు భారీగా చేరుకున్నారు. అదేసమయంలో ప్రశాంత్, అమరదీప్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. అప్పుడే బయటకు వచ్చిన అమరదీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ కారు అద్దం పగలకొట్టారు. ఇంకా కొందరి కార్లపై దాడులు చేశారు. పోలీసులు హెచ్చరించినా పట్టించుకోకుండా పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. అభిమానం పేరుతో నడిరోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేయడం, ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేయడంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసి సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.