»Pallavi Prasanth When Will Bigg Boss Distribute The Prize Money To The Farmers Pallavi Prasanth
Pallavi Prasanth: బిగ్ బాస్ ప్రైజ్ మనీని రైతులకు పంచేదెప్పుడు పల్లవి ప్రశాంత్..?
బిగ్ బాస్ ఇంట్లోకి రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ తన ఆటతో అందిరిని మెప్పించాడు. తన మాటతీరుతో, మంచితనంతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇలా బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా నిలిచి..చివరికి టైటిల్ సాధించారు.
Pallavi Prasanth: బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొన్నవారిలో పల్లవి ప్రశాంత్ ఒకరు. రైతు బిడ్డగా బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి అందరి మనసులు గెలుచుకున్నారు. రైతు గురించి, తన తండ్రి గురించి ఎమోషనల్ గా మాట్లాడుతూ..ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. ఇలా బిగ్ బాస్ పెట్టిన ఆటల్లో కూడా తనదైన శైలిలో చురుకుడా పాల్గొనేవారు. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్7 విన్నర్ గా నిలిచారు పల్లవి ప్రశాంత్.
బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టిన రోజు నుండి తన అద్భుతమైన నటనతో, ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. పల్లవి ప్రశాంత్ ఆడే తీరులో గానీ, అతను మాట్లాడే మాటతీరులో గానీ నిజాయితీ కనబడేది. అలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కొనసాగుతూ చివరికి టైటిల్ రేస్ కి చేరుకున్న ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచారు. అయితే బిగ్ బాస్ కొనసాగుతున్న టైం లోనే విన్నర్ గా నిలిస్తే ఆ డబ్బును ఏం చేస్తారు అంటూ అడిగారు బిగ్ బాస్. అప్పుడు పల్లవి ప్రశాంత్ ఏ మాత్రం మరో ఆలోచన లేకుండా వచ్చిన డబ్బంతా రైతులకు ఇచ్చేస్తా అని చెప్పారు.
ఇక, బిగ్ బాస్ గెలిస్తే అని అడిగిన మాట నిజమే అయింది. తానే విన్నర్ గా నిలిచాడు. అయితే బిగ్బాస్ కార్యక్రమంలో గెలిచినందుకు పల్లవి ప్రశాంత్ కు 15లక్షల డైమండ్ నెక్లెస్, దాంతో పాటు 15లక్షల విలువ చేసే కారు బహుమతిగా ఇచ్చారు. ఇక యావర్ 15లక్షలు తీసుకొని బయటకు వచ్చాడు. దాంతో పల్లవి ప్రశాంత్ కి ప్రైజ్ మనీ కేవలం రూ.35 లక్షలు మాత్రమే వచ్చాయి. కాగా, బిగ్ బాస్ లో ఉన్నప్పుడు, తాను గెలిస్తే ఆ వచ్చిన డబ్బును రైతులకు ఇస్తా అని మాట ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ ద్వారా గెలిచిన మనీ ఇంతవరకు రైతులకు పంచకపోవడం ఇచ్చిన మాట తప్పారు అంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్.
ఇక ఆయనపై వస్తున్న విమర్శలపై తాజాగా స్పందించారు పల్లవి ప్రశాంత్. ఇచ్చిన మాట తప్పేదే లేదని బదులిచ్చారు. ప్రాణం పోయిన అన్న మాట నిలబెట్టుకుంటా అని..త్వరలోనే బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బును రైతులకు పంచబోతున్నానంటూ వెల్లడించారు. అయితే…ఇక్కడ ఇంకో విషయమేంటంటే..రూ.35లక్షల్లో టాక్స్ అంతా పోయి కేవలం రూ.16లక్షలు మాత్రమే తన చేతికి వచ్చిందని…ఆ డబ్బును రైతులకు పంచబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.