»Army Vice Chief Lieutenant General Upendra Dwivedi Will Be The New Vice Chief Of The Army
Army Vice Chief: ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు
ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా పనిచేసిన ఆయన లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ స్థానాన్ని భర్తీ చేశారు.
Army Vice Chief: ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా పనిచేసిన ఆయన లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ స్థానాన్ని భర్తీ చేశారు. జమ్ముకశ్మీర్ ఉధంపూర్‌లోని నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఎంవీ సుచీంద్ర కుమార్ నియమితులయ్యారు. ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, దీనికి ముందు నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు నివాళులు అర్పించారు. అలాగే కొత్త బాధ్యతలు స్వీకరించే ముందు గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ ఏడాది మే 31న పదవీ విరమణ చేయనున్నారు.