»Police Case Registered Against Pallavi Prashant And Amardeep Fans
BiggBoss7: పల్లవి ప్రశాంత్, అమర్దీప్ ఫ్యాన్స్‌పై పోలీస్ కేసు నమోదు
బిగ్‌బాస్7 విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అమరదీప్ అభిమానులు పరస్పర దాడులకు దిగారు. ఆర్టీసీ బస్సుతో సహా పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఇరువురి అభిమానులపై కేసులు నమోదు చేశారు.
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్7 ముగిసింది. ఈ సీజన్ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ పేరును నాగార్జున ప్రకటించారు. మరోవైపు రన్నరప్‌గా అమరదీప్ నిలిచాడు. హౌస్‌లో ఈ ఇద్దరూ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అయితే హౌస్ బయట ఈ ఇద్దరి ఫ్యాన్సే అంతకంటే ఎక్కువ హంగామా చేశాడు. నడిరోడ్డుపై అభిమానులు కొట్టుకున్నారు. ఒకరినొకరు పిడిగుద్దులు కొట్టుకుని నానా రచ్చ చేశారు. ఈ గొడవ అంతా అన్నపూర్ణ స్టూడియోస్ వద్దనే చోటుచేసుకుంది.
పల్లవి ప్రశాంత్, అమరదీప్ అభిమానులు బూతులతో రెచ్చిపోతూనే ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. పరస్పరం కొట్టుకోవడమే కాకుండా అటువైపు వెళ్లే వాహనాలపై కూడా దాడికి దిగారు. ఈ దాడిలో ఆర్టీసీ బస్సుతో పాటుగా పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. వారిని కంట్రోల్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దిగారు. అభిమానులపై లాఠీఛార్జ్ కూడా చేయడంతో అక్కడి వాతావరణం కాస్త చల్లబడింది.
ఆర్టీసీ బస్సుతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేయడంపై జూబ్లీహిల్స్ పోలీసులు సీరియస్ అయ్యారు. పల్లవి ప్రశాంత్, అమరదీప్ ఫ్యాన్స్‌పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పల్లవి ప్రశాంత్ అభిమానులు అయితే అమరదీప్ కారుపై మొదటగా దాడి చేశారు. ఆదివారం అర్థరాత్రి తర్వాత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి చక్కబడింది.