»Balakrishna And Mahesh Babu As Chief Guest For Bigg Boss 7 Telugu Finale
Bigg Boss తెలుగు ఫినాలే గెస్టులు వీళ్లే..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫినాలే గెస్టులు ఇద్దరని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఆయనతోపాటు బాలకృష్ణ కూడా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిసింది.
Balakrishna And Mahesh Babu As Chief Guest For Bigg Boss 7 Telugu Finale
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 (Bigg Boss 7 Telugu) ఫినాలే మరో మూడు రోజుల్లో జరగనుంది. ఆరుగురిలో ఒక కంటెస్టెంట్ మీడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని వార్తలు చక్కర్లు కొట్టాయి. సీజన్లో మాత్రం ఒక్కో కంటెస్టెంట్ జర్నీని చూపిస్తున్నారు. ఈ రోజు అర్జున్ (Arjun), అమర్ (amar) జర్నీ టెలికాస్ట్ కానుంది. రేపు ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఫినాలే రేసులో ఐదుగురు ఉంటారు. వారిలో టైటిల్ రేసులో ప్రశాంత్, అమర్, శివాజీ మధ్య పోటి ఉంటుంది.
ఇక ఫినాలేకు చీఫ్ గెస్టులుగా ఇద్దరు ప్రముఖ హీరోలు రానున్నట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు (mahesh babu) గెస్ట్ అని వార్త గుప్పుమంది. కొత్త మూవీ గుంటూరు కారం ప్రమోషన్స్ కోసం ఫినాలేకు వస్తున్నారని విశ్వసనీయ సమాచారం. మహేశ్‌తోపాటు మరొకరు కూడా వస్తున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ (balakrishna) అని తెలిసింది. దీనికి సంబంధించి కూడా రూమర్స్ వస్తున్నాయి.
డైరెక్టర్ బాబీ బాలయ్యతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ జరుగుతోంది. సో.. ఆయన బిగ్ బాస్ ఫినాలేకు మాములు గెస్ట్ మాదిరిగా వస్తుండవచ్చు.. అంతే తప్ప మూవీ ప్రమోషన్ కోసం అయితే కాదు. కానీ ఫైనల్ వేదిక మీద ఇటు బాలయ్య, అటు మహేశ్ కలిసి.. ఫైనల్ విజేతకు అవార్డు అందజేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నిర్వాహకులు అధికార ప్రకటన మాత్రం చేయలేదు. ఈ నెల 17వ తేదీన స్టార్ మా టీవీలో బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది.