Salaar : ఆ విషయంలో యానిమల్ ని ఫాలో అవుతున్న మేకర్స్..?
ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా యాక్షన్ చిత్రం సలార్ (Salaar) మరో 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Salaar : ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా యాక్షన్ చిత్రం సలార్ (Salaar) మరో 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, దర్శక నిర్మాతలు మాత్రం వారి ఆలోచనలతో అభిమాలను ఆశ్చర్యపరుస్తున్నారు. సలార్ మేకర్స్ రన్‌టైమ్‌ని పొడిగించారు.
సలార్ చిత్రం 175 నిమిషాల 11 సెకన్ల రన్టైమ్తో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డ్ నుండి ఈ చిత్రానికి A సర్టిఫికేట్ లభించింది. సలార్ బృందం అదనంగా 1 నిమిషం 23 సెకన్ల రన్‌టైమ్‌ని పొందడానికి మళ్లీ సెన్సార్‌కి వెళ్లింది, ఇది పోస్ట్ క్రెడిట్ సన్నివేశంగా చేర్చబడింది. ఇప్పుడు, సలార్ రన్‌టైమ్ 176:44 నిమిషాలు. రీసెంట్ గా విడుదలైన మూవీ యానిమల్ రన్ టైమ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అంత రన్ టైమ్ ఉన్నా కూడా.. ప్రేక్షకులు ఆ మూవీ చూడటానికి క్యూలు కట్టారు. ఆ మూవీ ఫలితం చూసిన తర్వాత రన్ టైమ్ ఎక్కువ అయినా పర్లేదని సలార్ టీమ్ భావించందట. అందుకే, రన్ టైమ్ ని పెంచాలని భావించింది.
సలార్ టీమ్ ఇప్పుడు మంచి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది. సినిమా నుంచి ఓ పాటను విడుదల చేసింది. త్వరలో యాక్షన్ ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు. సలార్ మేకర్స్ సినిమా రన్‌టైమ్‌ని పొడిగించారని తెలియగానే అభిమానులు ఆశ్చర్యపోయారు. రిపోర్ట్ ప్రకారం, SS రాజమౌళితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది, అక్కడ మావెరిక్ ఫిల్మ్ మేకర్ ప్రభాస్, ప్రశాంత్ నీల్లతో చాట్ చేస్తాడు.