»Bhagavanth Kesari Ott Streaming Date And Release Partner
Bhagavanth Kesari ఓటీటీకి వచ్చేస్తున్నాడు..!
భగవంత్ కేసరి మూవీ ఓటీటీ ప్లాట్ పామ్ ఖరారైంది. ఈ నెల 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి ప్రైమ్ వీడియో మాత్రం ప్రకటన విడుదల చేయలేదు.
Bhagavanth Kesari OTT Streaming date and Release Partner
Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా అక్టోబర్ 19న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సినిమా కలెక్షన్లు కూడా దుమ్ము రేపుతున్నాయి. మూవీ టీమ్ విజయోత్సవాలను జరుపుకుంటున్నాయి. ముఖ్యంగా బాలయ్య, శ్రీలీల కలిసి సందడి చేస్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ ఇంకా, ఈ మూవీ ఫీవర్ నుంచి బయటకు రాలేదు. ఈ లోగా ఈ మూవీ ఓటీటీలోకి కూడా వచ్చేస్తోందని తెలుస్తోంది.
భగవంత్ కేసరి OTT స్ట్రీమింగ్ తేదీ, విడుదల భాగస్వామి వివరాలు బయటకు వచ్చాయి. దసరా సీజన్లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు కాగా, శ్రీలీల లీడ్ రోల్ చేసింది. భగవంత్ కేసరి OTT స్ట్రీమింగ్ తేదీ విడుదల భాగస్వామి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
భగవంత్ కేసరి నవంబర్ 23, 2023న OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. OTT దిగ్గజం దీని గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అధికారిక నిర్ధారణ ఉంటుంది. ఆ తర్వాత, సినిమా స్ట్రీమింగ్ తేదీ, విడుదల భాగస్వామి వివరాలు అధికారికంగా వెలువడతాయి.