Telugu stars Ananya Reddy and Kaushik who achieved top ranks in civils
UPSC Results: యూపీఎస్సీ ఫలితాలు వచ్చాయి. ఈ రిజల్ట్‌లో ఇద్దరు తెలుగు వాళ్లు సత్తా చాటారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి, మరో వ్యక్తి కౌశిక్. తొలి ప్రయత్నంలోనే ఎలాంటి శిక్షణ లేకుండా అనన్య రెడ్డి ఈ ఘనత సాధించడం మాములు విషయం కాదు. అందరికీ తెలిసిన విషయమే సివిల్స్ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా అన్ని అవరోధాలను జయించి భారత దేశంలోనే టాప్ 3 ర్యాంకర్‌గా నిలించింది. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు చదువేదని అనన్య చెప్పారు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదులుకొని మెయిన్స్‌కు ప్రిపేర్ అయిన కౌశిక్ మొదటి ప్రయత్నంలోనే 82వ ర్యాంక్ సాధించారు. ఓయూలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తరువాత ఢిల్లీలో ఎంబీఏ చేశారు. సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో జాబ్ వదిలేసి మెయిన్స్ కోసం కష్టపడ్డట్లు ఆయన తెలిపారు. అయితే ఇలా 100లోపు ర్యాంకు వస్తుందని ఆయన ఏ మాత్రం ఊహించలేదట. దివ్యాంగుల కోసం, ఆరోగ్య రంగంపై పనిచేయాలని ఉందని తెలిపారు.