Ananya Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సివిల్స్ టాపర్ అనన్యరెడ్డి
సివిల్స్ సత్తా చాటిన అనన్య రెడ్డిని తెలంగాణ సీఎం సన్మానించారు. టాప్ 3 ర్యాంకు సాధించినందుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది పెద్ద మొత్తంలో సివిల్స్ విజయం సాధించారు.
Ananya Reddy: యూపీఎస్సీ ఫలితాల్లో తెలుగు తేజాలు సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక ఆల్ ఇండియా 3 ర్యాంక్ సాధించిన అనన్య రెడ్డి తెలుగు అమ్మాయి కావడం విశేషం. ఈ సందర్భంగా అనన్యరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. శనివారం మధ్యహ్నాం సీఎం ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. ఆమె సాధించిన విజయాన్ని కొనియాడు అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా అనన్య కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
మహబూబ్ నగర్‌కు చెందిన దోనూరి అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించడం విశేషం. అయితే తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థినికి వరసుగా మూడో ర్యాంకు రావడం ఇది రెండోసారి. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీస్‌లో తెలుగు విద్యార్థులు 60 మంది సత్తా చాటారు. ఇక అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే అంతటి విజయాన్ని సాధించడం ఎంతో మంది ఔత్సహికులకు ప్రోత్సాహాన్ని నింపింది. కష్ట ఫలే అని మరొక్కసారి రుజువైంది.