MHBD: మహాత్మ జ్యోతిరావుపూలే 135 వర్ధంతి వేడుకలను మానుకోట పట్టణ కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. పూలే ఆశయ సాధన సమితి(PASS), అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ (ABSF), మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా పట్టణంలోని పూలే విగ్రహం వద్ద వారు నివాళులు అర్పించారు. పూలే ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు.