»Election Notification The Process Of Election In Telugu States Will Begin Notification Will Be Released On April 18
Election Notification: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ షురూ.. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నాల్గవ దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.
Election Notification: దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నాల్గవ దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13న తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనుండగా, ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఇక అక్కడి నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుంది. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు తమ తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఏప్రిల్ 25వ తేదీ నామినేషన్లు వేయడానికి చివరి తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన జరగనుంది.
ఏప్రిల్ 29న నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్ 30వ తేదీన ఎన్నికల బరిలో నిలబడే తుది అభ్యర్ధుల జాబితా విడుదల కానుంది. ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్ధులు మే 13న తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఏపీలో 175 నియోజక వర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 25 లోక్సభ స్థానాలకు పోటీ జరగనుంది. తెలంగాణలో మాత్రం 17లోక్సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనుంది. మరోవైపు కూటమి నుంచి టీడీపీ 144 స్థానాల్లోను, జనసేన 21 స్థానాల్లోను, బీజేపీ 10 స్థానాల్లోను పోటీ చేయనుంది. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల బరిలో నిలుస్తోంది. ఎన్నికల్లో పోటీకి దిగుతున్నప్పటికీ ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపే స్థాయిలో లేదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేశారు.