»Tatikonda Rajaiah Who Made Angry Comments On Kadiam Srihari
Tatikonda Rajaiah: బిడ్డ కడియం శ్రీహరి ఇక కాస్కో
బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ కండువ కప్పుకున్న కడియం శ్రీహరిపై మాజీ మంత్రి తాటికోండ రాజయ్య తీవ్రమైన విమర్శలు చేశారు. ఇద్దరి మధ్య కబడ్డీ ఆట షూరు అని సవాల్ విసిరాడు. చూసుకుందాం నువ్వో నేనో అంటూ మండిపడ్డారు.
Tatikonda Rajaiah who made angry comments on Kadiam Srihari
Tatikonda Rajaiah: బిడ్డా కడియం శ్రీహరి ఇక చూస్కో.. ఇద్దరి మధ్య కబడ్డీ మొదలైంది ఇక కాస్కో.. తగ్గేదే లేదు అంటూ మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మండిపడ్డారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ కండువ కప్పుకున్న కడియంపై రాజయ్య విమర్శలు చేశారు. వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దమ్ముంటే శ్రీహరి చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఆయన చేసిన పనులేంటో చెప్పాలని సవాల్ విసిరారు. కడియంకు దేశవిదేశాల్లో ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. ఆయన ఆస్తులకు కడియం కావ్య, తన భర్త నజీర్ బినామీలుగా ఉన్నారని ఆరోపించారు.
ఇన్నాళ్లు నమ్మిన పార్టీని వీడీ కాంగ్రెస్ పంచన చేరావు అని విమర్శించారు. అన్ని పదవులు అనుభవించి కావాల్సినంత సంపాదించి వాటిని విదేశాల్లో దాచాడు అని అన్నారు. మలేసియా, సింగపూర్లలో ఆయన అక్రమాస్తులు కూడబెడుతున్నారన్నారు. డబ్బును హవాలా రూపంలో విదేశాలకు తరలించారని విమర్శించారు. కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఆయనదన్నారు. ఎన్కౌంటర్లు చేయించారని విమర్శించారు. పేకాటలో కూడా దొరికాడని, ఆ కేసులో జైలులో కూడా కూర్చున్నట్లు ఆరోపించారు.