»Mckinsey Plans To Cut 2000 Jobs In One Of Its Biggest Layoffs
McKinsey layoffs: మెకెన్సీలో 2000 ఉద్యోగాల కోత, ఆ కంపెనీలోను…
వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కోత (layoffs) కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకెన్సీ (McKinsey) 2000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. తమ క్లయింట్స్ తో నేరుగా సంబంధాలు ఉండని సహాయక సిబ్బందిని తొలగించే యోచనలో మెకెన్సీ ఉందని వార్తలు వస్తున్నాయి.
వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కోత (layoffs) కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకెన్సీ (McKinsey) 2000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. తమ క్లయింట్స్ తో నేరుగా సంబంధాలు ఉండని సహాయక సిబ్బందిని తొలగించే యోచనలో మెకెన్సీ ఉందని వార్తలు వస్తున్నాయి. గత పదేళ్లలో ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య చాలా వేగంగా పెరిగింది. అయితే ప్రస్తుతం తీవ్ర ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న కారణంగా కాస్ట్ కట్టింగ్ లో (cost cutting) భాగంగా కొంతమందికి పింక్ స్లిప్ ఇవ్వనుంది ఈ కంపెనీ. రానున్న రెండు మూడు వారాల్లో తొలగింపుల ప్రణాళికను అధికారికంగా ప్రకటించవచ్చు. పదకొండేళ్ల క్రితం అంటే 2012 లో ఈ కంపెనీలో 17 వేల మంది ఉద్యోగులు ఉండేవారు. 2017 నాటికి ఈ సంఖ్య 28 వేలకు చేరుకున్నది. ఇప్పుడు 45,000కు చేరుకుంది. పదేళ్లలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఓ వైపు ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ, మరోవైపు క్లయింట్లతో నేరుగా పని చేసే నిపుణుల నియామక ప్రక్రియ ఆగబోదని స్పష్టం చేసింది. ఈ కంపెనీ దాదాపు 100 సంవత్సరాల క్రితం చికాగోలో ప్రారంభించారు. 1926లో ప్రారంభమైంది. ప్రస్తుతం 130 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2021లో కంపెనీ ఆదాయం 15 బిలియన్ డాలర్లు కాగా, 2022 క్యాలెండర్ ఏడాదికి గాను ప్రకటించవలసి ఉంది. చాలా వరకు అమెరికా సహా వివిధ దేశాల్లోని టెక్ కంపెనీలు ఉద్యోగాల కోతను అమలు చేస్తున్నాయి.
పాలీగోన్లో కూడా…
ఎథేరియం బ్లాక్ చైన్ కోసం ముగ్గురు భారతీయులు స్థాపించిన సెకండరీ స్కేలింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ పాలీగాన్ (Polygon) కూడా ఇరవై శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ప్రభావం వంద మంది ఉద్యోగులపై పడిందని సంస్థ కో-ఫౌండర్ సందీప్ నెయిల్వాల్ తెలిపారు. లేయర్ 2 బ్లాక్ చైన్ కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా ఈ తొలగింపులు చేపట్టినట్లు చెప్పారు. క్రిప్టో కరెన్సీ ఇటీవల చాలాకాలంగా డౌన్ సైకిల్ ను చూస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నది. తమ కంపెనీ ట్రెజరీ 250 మిలియన్ డాలర్లతో బలంగానే ఉందని చెప్పారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో పాలీగాన్ ల్యాబ్స్ కింద బహుళ వ్యాపార యూనిట్లను ఏకీకృతం చేసినట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా తమ బృందంలో కొంతమందిని తగ్గించవలసి వచ్చిందని, ఇరవై శాతాన్ని తగ్గించామని వెల్లడించారు. ఇది బాధాకరమైనప్పటికీ తప్పడం లేదన్నారు. గత ఏడాది ఫిబ్రవరి నెలలో పాలీగాన్… సాఫ్టు బ్యాంక్ విజన్ ఫండ్ 2, టైగర్ గ్లోబల్, ఎలివేషన్ క్యాపిటల్, యాక్సెల్ పార్ట్ నర్స్, స్టీడ్ వ్యూ క్యాపిటల్ వంటి సంస్థలకు మాటిక్ చేయడం ద్వారా 450 మిలియన్ డాలర్లను సేకరించింది.
ఫైనాన్స్ నుండి టెక్నాలజీ, రిటైల్ వరకు అన్ని రంగాల్లోను పలు కంపెనీ తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ పోతున్నాయి. కరోనా తర్వాత ఆర్థిక కష్టాలు, ఆర్థిక మాంద్యం భయాలతో వ్యయ నియంత్రణకు మొగ్గు చూపుతున్నాయి కంపెనీలు. ముఖ్యంగా టెక్ రంగంలో అధిక తొలగింపులు ఉన్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఉద్యోగాల కోతను అమలు చేస్తున్నాయి. గోల్డ్ మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ వంటి ఆర్థిక దిగ్గజాలు కూడా ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి.