Srinivas Pallia as the new CEO of Wipro.. What is the salary?
Wipro CEO: ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రోకు కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా నియమితులయ్యారు. థియరీ డెలాపోర్టే రాజీనామా తరువాత శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. డెలాపోర్టేకు 2025 జులై వరకు సమయం ఉన్నా ఒక సంవత్సరం ముందుగానే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఈనేపథ్యంలో కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ పల్లియా సాలరీ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆయనకు ఏడాదికి 7 మిలియన్ల డాలర్ల చొప్పున వేతనం అందుకుంటున్నట్లు తెలుస్తుంది. దీన్ని భారత కరెన్సీ ప్రకారం చెప్పాలంటే సుమారు రూ. 58.38 కొట్లు. ఇందులో పల్లియా బేసిక్ వేతనం 1.75 మిలియన్ డాలర్ల నుంచి 3 డాలర్ల మధ్య ఉంటుంది.
దీంతో పాటు వేరెబుల్పే రూపంలో 1.75 డాలర్ల నుంచి 3 మిలియన్ డాలర్ల మధ్య అందుకోనునన్నారు. అంటే కంపెనీ ప్రగతిని బట్టీ, ఆదాయం, లాభంతో ఆయన వేతనం ఉంటుంది. అలాగే స్టాక్స్ రూపంలో పల్లియాకు మరికొన్ని ప్రయోజనాలు ఉంటాయి. 4 మిలియన్ డాలర్ల విలువైన రిస్ట్రిక్టడ్ స్టాక్ యూనిట్ (RSU), పెర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్లు (PSU) ఆయన పేరుమీద ఉంటాయి. అవి దశల వారిగా ఆయనకు లభిస్తాయి. అంటే 2025 మే 2న 25 శాతం, 2026 మే 2న మరో 25 శాతం, 2027 మే 2 నాటికి 50 శాతం స్టాక్స్ యూనిట్లు అందుతాయి.