Gold and Silver Rates Today : రేటు తగ్గినప్పుడు బంగారాన్ని కొనుక్కోవాలని చూసుకునే వారు ఎప్పటికప్పుడు దాని ధర ఎంత ఉందనేది తెలుసుకుంటూ ఉండటం అత్యావశ్యకం. మరి ఇవాల్టి బంగారం ధర ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి. మంగళవారం పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం లాగే మంగళవారం కూడా 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 74,340గా కొనసాగుతోంది.
చదవండి : హల్దీలో డ్యాన్స్ చేస్తుండగా 18 ఏళ్ల యువతికి గుండె పోటు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,340గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
చదవండి : విడుదలైన తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. బాలికలదే హవా
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate)లు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. రూ.300 తగ్గి రూ.83,080 వద్ద కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అప్‌ట్రెండ్‌లో నడిచిన పసిడి, వెండి ధరలు గత వారం రోజులుగా కాస్త స్థిరంగా ఉండటం గమనార్హం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు సైతం స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2,330 డాలర్లుగా, ఔన్సు వెండి ధర 26.96 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర ప్రస్తుతం 24.64 డాలర్లుగా ఉంది.

