Credit Card: ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా?
ప్రస్తుతం చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే ఈ కార్డులతో బిల్లులు చెల్లించే వాళ్లకి ఇకపై అదనపు రుసుములు పడతాయి. అయితే ఇది అన్ని బ్యాంకులు కాదు. కొన్ని బ్యాంకులు మాత్రమే. మరి అవేంటో చూద్దాం.
Credit Card: Paying bills with these credit cards?
Credit Card: క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు తీసుకుని ఉంటే వాడికి రుసుము పడుతుంది. అయితే ఇకపై విద్యుత్, ఫోన్, గ్యాస్, ఇంటి అద్దె వంటి యుటిలిటీ బిల్లులు క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే రుసుము వసూలు చేస్తాయి. ఇవి అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు వర్తించవు. యస్ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంకు మే 1 నుంచి వసూలు చేయనున్నాయి. క్రెడిట్ కార్డులతో చెల్లించే యుటిలిటీ బిల్లులపై 1 శాతం రుసుము వసూలు చేయనున్నాయి.
యస్, ఐడీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డుతో విద్యుత్ బిల్లు రూ.2000 చెల్లిస్తే మీరు రూ.20 రుసుము ఎక్స్ట్రాగా భరించాలి. అయితే ఇది అందరికీ వర్తించదు. యస్ బ్యాంకులో నెలవారీ యుటిలిటీ బిల్లుల విలువ రూ.15000 దాటితేనే అదనపు రుసుము వర్తిస్తుంది. ఉదాహరణకు ఫోన్, విద్యుత్, టీవీ, అద్దె ఇలాంటి యుటిలిటీ బిల్లుల చెల్లింపు మొత్తం రూ.15 వేలు దాటితే.. మళ్లీ యుటిలిటీ బిల్లు చెల్లించాలంటే అదనపు ఫీజు తప్పదు.