»Prabhas Can Prabhas Buy A House With London House Rent
Prabhas: ప్రభాస్ లండన్ ఇంటి రెంట్‌తో ఇల్లు కొనుక్కోవచ్చు?
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా కలకి 2898ఏడి. సమ్మర్లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే. దీంతో కల్కి 2898ఏడి పై భారీ అంచనాలున్నాయి. అయితే.. ప్రస్తుతం ప్రభాస్ లండన్ ఇంటి రెంట్ వైరల్‌గా మారింది.
Prabhas: ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ కెరీర్లో 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది కల్కి 2898 ఏడి. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ నిర్మిస్తున్న ఈ సినిమాను.. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ వరల్డ్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తున్నాడు ప్రభాస్. ఖచ్చితంగా హాలీవుడ్ రేంజ్లో కల్కి ఉంటుందని చెబుతున్నారు. మే 9న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున కల్కి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని ఏకంగా 22 భాషలలో ఏక కాలంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దీంతో.. 22 భాషలలో పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా కల్కి రికార్డ్ క్రియేట్ చేసినట్టే.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ లండన్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలె ప్రభాస్ పై ఒక కీలక షెడ్యూల్ కంప్లీట్ చేశారు. అయితే.. ఈ షెడ్యూల్ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న ప్రభాస్.. లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈసారి వెకేషన్‌కి వెళ్లాడా? లేదా హెల్త్ కోసం వెళ్లాడా? అనేది తెలియదు గానీ.. ప్రజెంట్ మాత్రం డార్లింగ్ లండన్‌లో చిల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే.. అక్కడ ప్రతిసారి హోటల్స్‌లో ఉండలేక.. లండన్‌లో ఒక అద్దె ఇల్లు తీసుకున్నాడట డార్లింగ్. ఆ విలాసవంతమైన ఇంటి రెంట్ మాత్రం మామూలుగా లేదట.
ప్రభాస్ లండన్ హౌజ్ రెంట్ నెలకు సుమారు 60 లక్షలు ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. పాన్ ఇండియా స్టార్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. ప్రభాస్ చెల్లించే రెంట్‌తో ఒక చిన్నపాటి ఇల్లే తీసుకోవచ్చు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక.. ప్రభాస్ లండన్ లోనే కొన్నిరోజులు ఉండనున్నాడు. ఇండియాకి తిరిగి వచ్చాక కల్కి షూటింగ్లో తిరిగి పాల్గొంటాడని తెలుస్తోంది. అయితే.. ఇది కల్కి పార్ట్ 2 షూటింగ్ అని సమాచారం. కల్కి పార్ట్ 1 మే 9న రిలీజ్ కానుంది.