»When The Owner Saw The Current Bill Of The House His Heart Stopped Working
Power bill : ఆరున్నర లక్షలకుపైగా కరెంటు బిల్లు చూసి అవాక్కైన ఇంటి యజమాని!
వేసవి కాలంలో కరెంటు బిల్లు ఎంత వస్తుందా? అని అంతా భయపడుతుంటారు. అయితే తెలంగాణ భువనగిరి జిల్లాలో ఓ సాధారణ ఇంటి యజమానికి ఏకంగా ఆరున్నర లక్షలకు పైగా కరెంటు బిల్లు వచ్చింది. దీంతో అవాక్కవడమే అతడి వంతైంది.
Power bill : భారీగా కరెంటు బిల్లు వస్తున్న ఘటనలును అప్పుడప్పుమూ మనం వింటూ ఉంటాం. అలాగే ఇప్పుడు తెలంగాణ, భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలంలోని రహీంఖాన్ పేటలో ఓ ఘటన చోట చేసుకుంది. అక్కడ స్థానికంగా నివాసం ఉంటున్న ఓ ఇంటి యజమానికి కరెంటు బిల్లు షాకిచ్చింది. ఏకంగా రూ.6,72,642 కరెంటు బిల్లు(Current Bill) వచ్చింది. దీంతో ఆ బిల్లు చూసిన ఇంటి యజమానికి నిజంగానే కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
గ్రామానికి చెందిన పరశురాములు అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన జరిగింది. సోమవారం ట్రాన్స్కో సిబ్బంది ఇంటికి వచ్చి కరెంటు బిల్లు తీశారు. ఆ మీటరు గృహ జ్యోతి పథకం కింద ఎంపికైన మీటరు. ఉచితంగా 200 యూనిట్లలోపు సబ్సిడీ వస్తుంది. అయితే దాన్ని రీడింగ్ తీయగా ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో బిల్లు వచ్చింది. ఇంత బిల్లు రావడం ఏంటని సిబ్బందిని ప్రశ్నించాడు.
ఈ విషయమై ట్రాన్స్కో ఏఈ ప్రభాకరరెడ్డి వివరణ ఇచ్చారు. రీడింగ్ తీసే సమయంలో ఎప్పుడైనా హై ఓల్టేజ్ వచ్చినట్లైతే రీడింగ్ జంప్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. ఇంత బిల్లు వచ్చిన మీటరును టెస్టింగ్ కోసం పంపిస్తున్నట్లు తెలిపారు.