ఏపీలో ఓ చిన్న గుడిసెకు విద్యుత్ శాఖ అధికారులు (Electricity department) కరెంట్ బిల్లు రూపంలో షాక్ ఇచ్చారు.అనకాపల్లి జిల్లాలోని ఎస్ రాయవరం పరిధిలోని గోకులపాడు దళిత కాలనీలో వెలుగులోకి వచ్చింది.ఆటో డ్రైవర్ రాజు బాబు తన కుటుంబంతో కలిసి పూరి గుడిసెలో జీవిస్తున్నాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.అయితే ఈ నెల కరెంట్ బిల్లు (Current Bill) ఏకంగా రూ.3,31,951వచ్చింది. బిల్లును చూసిన రాజుబాబు (Rajubabu) కుటుంబం ఒక్కసారిగా షాక్ అయ్యింది.
ఇంత చిన్న పూరి గుడిసె(Puri Hut)కు మూడు లక్షలకు పైగా కరెంట్ బిల్లు రావడంతో అధికారులను ఆశ్రయించారు. అయితే సాంకేతిక తప్పిదం వల్ల ఈ పొరపాటు చేసుకుందని విద్యుత్ శాఖ అధికారులు రాజు బాబుకు తెలపడంతో కుటుంబం ఊపిరి పీల్చుకుంది. అనంతరం విద్యుత్ శాఖ అధికారులు బిల్లును సరిచేసి ఈ నెల కరెంట్ బిల్లు రూ.155 వచ్చినట్లు తెలిపారు. రాజుబాబు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.