Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. రాష్ట్రంలో మహిళలు కనిపించకుండా పోతున్నారని ఇటీవల పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలకు మహిళా కమిషన్ నోటీసులు ఇష్యూ చేసింది. ఏపీలో మిస్సింగ్ కేసులపై పవన్ (pawan) మాట్లాడారు. 30 వేల మంది మిస్ అయ్యారని.. అందులో 14 వేల మంది ఆచూకీ తెలియలేదని పేర్కొన్నారు. ఆ డేటా మీకు ఎక్కడిదని.. ఏ అధికారి చెప్పారో తెలియజేయాలని మహిళా కమిషన్ కోరింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు లేవా అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (vasireddy padma) ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ (pawan) వాలంటీర్లపై విషం కక్కుతున్నారని పేర్కొన్నారు. రాజకీయ కోసం పవన్ కల్యాణ్ దిగజారుతున్నారని విమర్శించారు. డైలాగ్స్ కొట్టి వెళ్లడం అలవాటుగా మారిందని విరుచుకుపడ్డారు. సీఎం సీటు కోసం ఎవరినైనా ఫణంగా పెడతారా అని అడిగారు. ఏలూరులో మహిళల మిస్సింగ్‌పై పవన్ కల్యాన్ చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని మహిళా కమిషన్ కోరింది. పవన్ కామెంట్స్ మహిళల భద్రతకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది.
ఏలూరులో నిన్న వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల అదృశ్యం, అక్రమ రవాణా వెనక వైసీపీ నేతలు ఉన్నారని కామెంట్ చేశారు. వాలంటీర్లు రహస్యంగా సమాచారాన్ని సేకరిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ప్రతీ గ్రామంలో వాలంటీర్లతో కుటుంబంలో ఎంతమంది ఉన్నారు.. వారిలో మహిళలు ఎందరు..? వితంతువులు ఉన్నారా..? అని ఆరా తీశారు. జగన్ పాలనలో 30 వేల మందిలో 14 వేల మంది ఆచూకీ తెలియదు. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణం అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ వ్యాఖ్యలపై ఈ రోజు ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీచేసింది.