Lakshya Sen: కెనడా ఓపెన్ టైటిల్ విభాగంలోనూ భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ (Lakshya Sen) హవా కొనసాగింది. పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ చెనాకు చెందిన షై ఫెంగ్ విక్టరీ కొట్టాడు. 21-18, 22-20 తేడాతో వరుస గేమ్‌లలో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. దీంతో ఈ ఏడాది తొలి డబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ గెలుచుకున్నట్టు అయ్యింది. లక్ష్యసేన్‌కు ఇది రెండో బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టైటిల్. వరల్డ్ 19వ ర్యాంకర్‌గా ఉన్న లక్ష్యసేన్ (Lakshya Sen) తన కన్నా మెరుగైన ర్యాంగ్లో ఉన్న షై ఫెంగ్‌పై విజయం సాధించాడు. షై ఫెంగ్ వరల్డ్ 10వ ర్యాంగులో ఉండగా.. లక్ష్యసేన్ 19వ ర్యాంకులో ఉన్నాడు. షై ఫెంగ్‌పై విజయంతో లక్ష్యసేన్ ర్యాంగ్ మరింత మెరుగు పడి.. 12వ స్థానానికి చేరింది. లక్ష్యసేన్ కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కెనడా ఓపెన్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. నెక్ట్స్ యూఎస్ ఓపెన్‌లో లక్ష్యసేన్ ఆడతాడు.
‘కొన్నిసార్లు కష్టతర పోరాటాలు మధుర విజయాలకు దారితీస్తాయి. దీంతో తన నిరీక్షణ ముగిసింది. కెనడా ఓపెన్ విజేత అయినందుకు సంతోషిస్తున్నాను అని’ లక్ష్యసేన్ (Lakshya Sen) ట్వీట్ చేశాడు. కెనడా టైటిల్ గెలిచిన లక్ష్యసేన్‌కు (Lakshya Sen) అభిమానులు విష్ చేస్తున్నారు. శభాష్.. యువర్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍 🏆😍
Lakshya defeated reigning All England winner 🇨🇳's Li Shi Feng to clinch the title 🔥💥