Credit Card: క్రెడిట్ కార్డుపై ఎంత మొత్తం వాడుకోవచ్చో అనేది కొంత పరిమితి ఉంటుంది. అయితే కస్టమర్ల అనుమతితో దాన్ని మించి వాడుకునే ఆప్షన్‌ను సంస్థలు ఇవ్వచ్చు. అవసరం లేకుంటే దీన్ని డీయాక్టివేట్ చేసుకోవచ్చు. కస్టమర్‌కు తెలియజేయకుండా మాత్రం అదనపు పరిమితిని అనుమతించడం, దానిపై ఛార్జీలు వసూలు చేయడం మాత్రం చేయవద్దు. పైగా ఓవర్ లిమిట్ ఛార్జీలను వేసేటప్పుడు వడ్డీ, రుసుములను క్రెడిట్ లిమిట్ పరిధిలోకి తీసుకోవద్దు. అలాగే కార్డు జారీ చేసే సంస్థలు కస్టమర్ల అనుమతితోనే క్రెడిట్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోతే కార్డు పంపినట్లయితే దాన్ని యాక్టివేట్ చేయవద్దు.
కేవలం ఆర్థిక లావాదేవీలు మాత్రమే కాకుండా.. స్టేట్మెంట్ తీయడం, పిన్ మార్చడం, లావాదేవీల పరిమితిని సవరించడం వంటివి చేసినా కార్డు వినియోగంలో ఉన్నట్లే. పై అంశాల్లో కాకుండా ఇతర ఏ కారణాలతోనైనా కస్టమర్ కేర్ సెంటర్‌కు కాల్ చేస్తే మాత్రం కార్డు ఉపయోగిస్తున్నట్లుగా పరిగణించరు. కార్డు జారీ సంస్థలపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే తొలుత జారీ సంస్థలకు తెలియజేయాలి. 30 రోజుల్లోగా స్పందించకపోయినా, తిరస్కరించినా, ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోయినా కస్టమర్ ఆర్బీఐ అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ లేదా దరఖాస్తు ఫారం ద్వారా ఫిర్యాదును సమర్పించవచ్చు.