»Check Advantages And Disadvantages Of Linking Credit Card To Upi
UPIకి క్రెడిట్ కార్డు లింక్ చేస్తున్నారా..? జర జాగ్రత్త..?
రూపే క్రెడిట్ కార్డును యూపీఐకి లింక్ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. చాలా మంది వాడుతున్నారు కూడా.. దీంతో సానుకూల అంశాలు చాలానే ఉన్నాయి. అలాగే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.
Check Advantages And Disadvantages Of Linking Credit Card To UPI
Credit Card To UPI: ఇటీవల రూపే క్రెడిట్ కార్డ్ (Credit Card) హోల్డర్లకు యూపీఐ లింక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. లింక్ చేసుకొని షాపు, షాపింగ్ మాల్స్ వద్ద వాడుకునే అవకాశం ఇచ్చింది. దీని వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో..? కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఓ సారి చూద్దాం పదండి.
ముందుగా ప్రయోజనాలను తెలుసుకుందాం.. ఇదివరకు బ్యాంకుల్లో డబ్బులు ఉంటేనే యూపీఐ ద్వారా పే చేసే అవకాశం ఉండే.. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ లింక్ చేసుకొని.. ఎంచక్కా వాడచ్చు. ఆ మొత్తం క్రెడిట్ కార్డ్ ఇచ్చిన సమయంలో కట్టే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్ మాదిరిగానే.. క్రెడిట్ కార్డు ద్వారా జరిపే యూపీఐ (UPI) చెల్లింపులపై కూడా రివార్డ్ పాయింట్లు పొందొచ్చు. కార్డ్ ఎక్కువ వాడేవారికి ఇది చక్కగా ఉపయోగ పడుతుంది.
యూపీఐ (UPI) లింక్ చేస్తే కార్డు అవసరం ఉండదు. మొబైల్ ఉంటే సరిపోతుంది. స్వైప్ మిషన్లు లేని చిన్న దుకాణాల్లో యూపీఐ ద్వారా కార్డ్ వినియోగించే అవకాశం ఉంది. చిన్న చెల్లింపులు కూడా బ్యాంక్ స్టేట్ మెంట్లో కనిపిస్తాయి. ఎప్పుడైనా స్టేట్ మెంట్ తీసుకునే అవకాశం ఉంది.
ఇక మైనస్ విషయానికి వస్తే.. రూపే క్రెడిట్ కార్డు యూజర్లకు మాత్రమే అవకాశం ఉంది. లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఉంటుంది. దీంతో వ్యాపారులపై భారం పడుతుంది. అలాగే యూపీఐ ఐడీ ఉపయోగించి చిన్న వ్యాపారాలకు క్రెడిట్ కార్డుతో లావాదేవీల చెల్లింపులు సాధ్యం కాదు. అకౌంట్లో డబ్బు లేకపోయినా కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరంగా అప్పుల ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంది. సో.. రూపే క్రెడిట్ కార్డ్..యూపీఐకి లింక్ చేస్తే ఫర్లేదు.. కానీ దాని వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. అలా జరగకుండా చూస్తే బెటర్.